News February 23, 2026

TG నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు?

image

TG: రాజ్యసభ సభ్యులు అభిషేక్ మను సింఘ్వీ, సురేశ్ రెడ్డి పదవీకాలం APR 9తో ముగియనుంది. ఆ ఖాళీలకు MAR 5లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. సింఘ్వీకి రెన్యువల్ ఉంటుందని సమాచారం. మరో స్థానం కోసం బెల్లయ్య, VH, మధుయాష్కీ, నరేందర్ రెడ్డి, కోదండరెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. TPCC చీఫ్ మహేశ్‌గౌడ్‌ను రాజ్యసభకు పంపి, ఆయన స్థానంలో MLCగా అజహరుద్దీన్‌ను ఎంపిక చేస్తారనే ప్రచారమూ ఉంది.

Similar News

News February 23, 2026

ఎర్రకోట, ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు

image

ఎర్రకోట, ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఖలిస్థానీ గ్రూప్ పేరుతో ఈమెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎర్రకోట, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు గుర్తించలేదని సమాచారం. ఉదయం ఢిల్లీలోని పలు స్కూల్స్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎర్రకోట సమీపంలో <<19199047>>ఉగ్ర దాడులు<<>> జరగొచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరించడం తెలిసిందే.

News February 23, 2026

ప్రభుత్వ కార్యాలయాల్లో Dy.CM ఫొటో… నేడు క్యాబినెట్లో చర్చ!

image

TG: GOVT ఆఫీసులలో Dy.CM భట్టి విక్రమార్క ఫొటో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం CM ఫొటో మాత్రమే ఉంది. ఇకపై Dy.CM ఫొటో కూడా ఏర్పాటు చేసేలా నేటి క్యాబినెట్‌ భేటీలో చర్చించే అవకాశం ఉంది. APలో Dy.CM ఫొటో ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడం తెలిసిందే. దానివల్ల నష్టం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో TGలో పెట్టినా న్యాయపరంగా ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది.

News February 23, 2026

కర్ణాటకలో 16 ఏళ్లలోపు వారికి మొబైల్ ఫోన్ నిషేధం?

image

స్మార్ట్ ఫోన్స్ అడిక్షన్ విద్యార్థుల్లో పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 16 ఏళ్లలోపు వారికి ఫోన్‌ వాడకాన్ని నిషేధించాలని యోచిస్తోంది. ఈ అంశంపై అభిప్రాయాలు తెలపాలని అన్ని ప్రభుత్వ వర్సిటీల వీసీలను సీఎం సిద్దరామయ్య కోరారు. ఆస్ట్రేలియాతో సహా పలు దేశాలు ఇప్పటికే విద్యార్థులకు మొబైల్ ఫోన్లను నిషేధించిన అంశాన్ని గుర్తు చేశారు.