News December 12, 2025

TG న్యూస్ అప్డేట్స్

image

* HYD వేదికగా ఈ నెల 19 నుంచి 21 వరకు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ జరగనుంది. ప్రదర్శనకు 700+ షార్ట్ ఫిల్మ్స్ రాగా 60 ఎంపికయ్యాయి.
* పలువురు కాంగ్రెస్ MLAలు, నాయకులకు క్యాబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఎర్రోళ్ల శ్రీనివాస్(BRS) హైకోర్టులో పిల్ వేశారు.
* వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు MP అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 13, 2025

రాష్ట్రంలో 60 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>తెలంగాణ <<>>స్టేట్ ఫొరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో 60 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఇంటర్, BA, BSc, MSc, .M.Tech, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, Lab టెక్నీషియన్, Lab అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. వెబ్‌సైట్: https://www.tgprb.in

News December 13, 2025

వెనిజుల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం!

image

వెనిజుల-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. వెనిజుల తీరం వెంబడి USకు చెందిన F/A-18 జెట్‌లు దాదాపు 40 నిమిషాల పాటు తిరిగాయి. అదే విధంగా బాంబర్లు, ఫైటర్ జెట్లు, లాంగ్‌ రేంజ్ డ్రోన్లు చక్కర్లుకొడుతుండటం ఉద్రిక్తతలకు దారితీసింది. తీరానికి 20 మైళ్ల దూరం వరకు ఇవి వచ్చినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ అక్రమ రవాణా విషయంలో ఆగ్రహంగా ఉన్న ట్రంప్‌ ఆ దేశంపై <<18453636>>దాడి<<>> చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

News December 13, 2025

SBIలోనూ వడ్డీ రేట్లు తగ్గాయ్

image

<<18500647>>RBI<<>> రెపో రేటును 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో SBI కూడా రుణ రేట్లను సవరించింది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ రేటు(EBLR)ను 7.90 శాతానికి కుదించింది. MCLRను 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.70 శాతానికి చేరింది. అలాగే 2-3 ఏళ్ల వ్యవధి FD రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40 శాతానికి, 444 రోజుల కాలవ్యవధి రేటును 6.45 శాతానికి పరిమితం చేసింది. ఈ రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయంది.