News November 16, 2025
TG న్యూస్ రౌండప్

* ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ HYDలో పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ ఏర్పాటుచేసిన తేనీటి విందుకు CM రేవంత్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ హాజరయ్యారు.
* రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 21న HYDలో భారతీయ కళా మహోత్సవానికి హాజరవుతారు. అక్కడి నుంచి పుట్టపర్తికి వెళ్లి సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు.
* రైతులకు యాసంగి బోనస్ రూ.200 కోట్లను వెంటనే విడుదల చేయాలి: హరీశ్ రావు
Similar News
News March 4, 2026
మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు?

మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోతున్నట్లు సమాచారం. ఢిల్లీ వెళ్లిన TG CM రేవంత్ ఎదుట లొంగిపోనుండగా కేంద్రానికి ఆయనను CM అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సారంగపూర్ (జగిత్యాల) వాసి గణపతి దశాబ్దాలుగా ఉద్యమంలో ఉన్నారు. అడవి పార్టీలన్నీ ఒకటై మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డాక ఈయన తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కొంతకాలంగా ఈయన నేపాల్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
News March 4, 2026
YELLOW ALERT: 5 రోజులు జాగ్రత్త

TG: రాష్ట్రంలో మార్చిలోనే ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. అటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో HYD వాతావరణ కేంద్రం పిడుగులాంటి వార్త చెప్పింది. రానున్న 5 రోజులు ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీలు నమోదవుతాయని వెల్లడించింది. ఈ నెల 7 నుంచి 33 జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. మీ ఏరియాల్లో టెంపరేచర్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 4, 2026
ఇరాన్ నౌకపై అమెరికా దాడి.. 100 మంది మృతి!

శ్రీలంకలో <<19296909>>ఇరాన్ నౌక<<>>పై జరిగిన దాడిలో 100 మంది చనిపోయారని తెలుస్తోంది. IRIS Dena షిప్ మునిగిపోయిందని, పలు బాడీలను గుర్తించామని శ్రీలంక నేవీ పేర్కొంది. నౌకలో 180 మంది సిబ్బంది ఉండగా, 30 మందిని కాపాడామని చెప్పింది. ఈ దాడి చేసింది తామేనని అమెరికా ప్రకటించింది. సబ్‌మెరైన్‌తో నౌకను పేల్చేసినట్లు వెల్లడించింది. FEB 18న విశాఖలో జరిగిన విన్యాసాల్లో ఈ షిప్ పాల్గొని తిరిగి వెళ్తుండగా అటాక్ జరగడం గమనార్హం.


