News December 14, 2025
TG రెండో దశ సర్పంచ్ ఎన్నికల అప్డేట్స్

* ఖమ్మం(D) అనాసాగరంలో సర్పంచ్ అభ్యర్థి దామల నాగరాజు(40) కన్నుమూశారు. నామినేషన్ రోజే అనారోగ్యంతో ఆస్పత్రి పాలవగా ఇవాళ పోలింగ్ రోజు చనిపోయారు.(ఫొటోలోని వ్యక్తి)
* నారాయణపేట(D) మరికల్‌కు చెందిన భాస్కర్ దుబాయ్ నుంచి వచ్చి ఓటు వేశారు.
* ఖమ్మం(D) గోళ్లపాడులో ఓ అభ్యర్థి స్లిప్‌తో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పోలింగ్ కేంద్రం వద్ద ఓ ఆకులోని అన్నం, బొగ్గులు, మాంసం, ఎండుమిర్చి, అభ్యర్థి స్లిప్ పెట్టారు.
Similar News
News December 15, 2025
ఇది రేవంత్‌కు చెంపపెట్టు.. ప్రజాగ్రహానికి సంకేతం: KTR

TG: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందని KTR అన్నారు. ‘రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ BRS అద్వితీయ ఫలితాలు సాధించింది. కాంగ్రెస్ మంత్రుల, MLAల నియోజకవర్గాల్లోనూ సత్తా చాటింది. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు ఇక కాలం చెల్లిందని ప్రజలు ఓటుతో మరోసారి తేల్చిచెప్పారు. ఈ ఫలితాలు రేవంత్‌కు చెంపపెట్టు. INC సగం స్థానాలను కూడా గెలవకపోవడం ప్రజాగ్రహానికి సంకేతం’ అని ట్వీట్ చేశారు.
News December 15, 2025
క్రమంగా పుంజుకుంటోన్న అరటి ధరలు

AP: గత నెలలో కిలో రూ.2కు పడిపోయిన అరటి ధరలు.. ఉత్తరాది వ్యాపారుల కొనుగోలుతో ఇప్పుడు పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం కిలో అరటి ధర కనీసం రూ.10, గరిష్ఠంగా రూ.16, రూ.17గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో అరటి సాగు పెరగడం, తక్కువ ధరకే నాణ్యమైన అరటి లభించడంతో ఉత్తరాది వ్యాపారులు అక్కడి సరుకునే కొనడంతో.. ఏపీలో అరటి ధర భారీగా పతనమై ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలకు ఎగుమతి నిలిచింది.
News December 15, 2025
ఆగని పతనం.. ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి

రూపాయి పతనం ఆగడం లేదు. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పడిపోతోంది. తాజాగా మరోసారి ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిని చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 90.75కు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే 26 పైసలు పతనమైంది. అమెరికాతో ట్రేడ్ డీల్ ఆలస్యం, పెరుగుతున్న వాణిజ్య లోటు, డాలర్లకు డిమాండ్, భారత్‌పై US 50 శాతం టారిఫ్‌లు ఈ క్షీణతకు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


