News July 19, 2024

ఈనెల 23 నుంచి TG అసెంబ్లీ సమావేశాలు

image

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 23న, శాసనమండలి సమావేశాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 23న కేంద్రం పార్లమెంటులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దానికి తగ్గట్లుగా ఈనెల 25న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 6 గ్యారంటీల అమలు, జాబ్ క్యాలెండర్, రుణమాఫీ తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది.

Similar News

News January 6, 2026

ఆ ఉద్యోగుల వయోపరిమితి పెంపు?

image

AP: రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9, 10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఇప్పటికే కొనసాగుతున్న 62ఏళ్లు పైబడిన 2,831మంది ఉద్యోగులపై దృష్టి సారించారు. వయోపరిమితి పెంపుతో పడే అదనపు భారాలపై వివరాలు సేకరించి మరోసారి భేటీ కావాలని ఉపసంఘం నిర్ణయించింది. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.

News January 6, 2026

RCFLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (<>RCFL<<>>)లో 10 సీనియర్ ఇంజినీర్, మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ/ బీటెక్ (కెమికల్ ఇంజినీరింగ్, కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ Engg.,పెట్రోకెమికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PwBDలకు ఫీజు లేదు. DV, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.rcfltd.com

News January 6, 2026

మిరపలో ఈ సేద్య విధానం ఆదర్శం

image

మిరప సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు కొందరు రైతులు. సేంద్రియ కషాయాల వాడకంతో పాటు బంతి, ఆముదం మొక్కలను మిరపలో పెంచి చీడల ఉద్ధృతిని తగ్గిస్తున్నారు. పంటకు హాని చేసే పురుగుల తీవ్రతను తగ్గించడానికి జిగురు అట్టలు, సోలార్ ట్రాప్స్ వాడుతున్నారు. వీడ్ కంట్రోల్ మ్యాట్స్ వాడి కలుపును అరికడుతున్నారు. ఇలా రసాయనాలు లేకుండానే అధిక దిగుబడి సాధిస్తున్నారు.