News July 22, 2024
రేపటి నుంచి TG అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులకు ఆమోదం?

TG అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్తో పాటు స్కిల్ వర్సిటీ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటన, రైతు భరోసా విధివిధానాలు, స్థానిక సంస్థల్లో BC రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధిపొందిన వారి నుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం, విద్య, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నట్లు సమాచారం.
Similar News
News November 25, 2025
మదనపల్లెలోకి పుంగనూరు.. తిరుపతిలోకి నగరి

చిత్తూరు జిల్లా స్వరూపం మరోసారి మారనుంది. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలను కొత్తగా ఏర్పడబోయే మదనపల్లె జిల్లాలో చేరుస్తారు. నగరి డివిజన్ మొత్తాన్ని తిరుపతి జిల్లాలోకి మార్చనున్నారు. నగరి, నిండ్ర, విజయపురాన్ని తిరుపతిలో కలిపి.. పాలసముద్రాన్ని చిత్తూరు డివిజన్లోకి మారుస్తారని సమాచారం. వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాలను తిరుపతిలో కలపాలనే ప్రజల డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోలేదు.
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.
News November 25, 2025
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై నేడు విచారణ

ఐబొమ్మ రవి కస్టడీలో సహకరించలేదని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన తరఫు న్యాయవాది శ్రీనాథ్ తెలిపారు. మొత్తం ఆయనపై 5 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఒక్క కేసులో రిమాండ్ విధించారని, మిగతా కేసుల్లో అరెస్టు కోసం సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇవాళ రవి బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనున్నట్లు పేర్కొన్నారు.


