News June 15, 2024
జులై రెండో వారంలో TG అసెంబ్లీ సమావేశాలు?

TG: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జులై రెండో వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ను జులై రెండు/మూడో వారంలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అందులో రాష్ట్రానికి వచ్చే కేటాయింపులను చూసుకొని దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారని సమాచారం.
Similar News
News January 7, 2026
రష్యా నుంచి భారత్ దిగుమతులు రూ.17లక్షల కోట్లు

ఉక్రెయిన్‌తో పూర్తిస్థాయి యుద్ధం మొదలైన నాటి నుంచి సుమారు రూ.15 లక్షల కోట్ల విలువైన చమురు, రూ.1.91 లక్షల కోట్ల విలువైన బొగ్గు రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్నట్టు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అంచనా వేసింది. చైనాకు 293.7 బిలియన్ యూరోల విలువైన చమురు, గ్యాస్, బొగ్గును రష్యా అమ్మింది. 2022 నుంచి ప్రపంచ శిలాజ ఇంధన అమ్మకాలతో రష్యా రూ.85-95 లక్షల కోట్లు సంపాదించినట్లు పేర్కొంది.
News January 7, 2026
జనవరి 07: చరిత్రలో ఈరోజు

* 1935: కలకత్తాలో భారత జాతీయ సైన్సు అకాడమీని నెలకొల్పారు.
* 1938: నటి బి.సరోజాదేవి జననం
* 1950: సామాజిక సేవకురాలు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా జననం
* 1967: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జననం (ఫోటోలో)
* 1979: బాలీవుడ్ నటి బిపాషా బసు పుట్టినరోజు
* 2008: జైపూర్ ఫుట్ (కృత్రిమ పాదం) సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ మరణం
News January 7, 2026
బాటిల్ మూత రంగుతో నీటిని గుర్తించవచ్చు!

మార్కెట్లో దొరికే వాటర్ బాటిల్ మూత రంగును బట్టి అందులోని నీటి రకాన్ని గుర్తించవచ్చు. నీలం రంగు మూత ఉంటే అది సహజ సిద్ధమైన మినరల్ వాటర్. తెలుపు రంగు ప్రాసెస్ చేసిన నీటిని, ఆకుపచ్చ రంగు ఫ్లేవర్డ్ నీటిని సూచిస్తాయి. బ్లాక్ కలర్ ఆల్కలైన్ వాటర్‌కు, రెడ్ ఎనర్జీ డ్రింక్స్‌కు సంకేతం. అయితే ఇది అన్ని కంపెనీలకు తప్పనిసరి నిబంధన కాదు. కొనేముందు లేబుల్ చెక్ చేయడం మంచిది.


