News March 17, 2024
TG: కార్పొరేషన్ ఛైర్మన్ల వివరాలు

నిర్మల (జగ్గారెడ్డి సతీమణి) – పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ
పటేల్ రమేశ్‌రెడ్డి – టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్
నేరెళ్ల శారద – మహిళా కమిషన్
బండ్రు శోభారాణి – మహిళా సహకార అభివృద్ధి సంస్థ
పొదెం వీరయ్య- అటవీ అభివృద్ధి సంస్థ
శివసేనారెడ్డి – స్పోర్ట్స్ అథారిటీ
జగదీశ్వర్‌రావు – ఇరిగేషన్ డెవలప్మెంట్
రాయల నాగేశ్వరరావు – గిడ్డంగుల సంస్థ
ఎన్.ప్రీతమ్ – ఎస్సీ కార్పొరేషన్
Similar News
News January 4, 2026
వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ నరసింహ

జిల్లాలో పెరుగుతున్న చలితీవ్రత, పొగమంచు నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. రహదారులపై దృశ్యమానత తక్కువగా ఉన్నందున వాహనాల మధ్య దూరం పాటిస్తూ, తక్కువ వేగంతో వెళ్లాలని కోరారు. ప్రయాణ సమయంలో ఇండికేటర్లు వాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదాల నివారణకు పోలీస్ పెట్రోలింగ్ నిరంతరం కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ఆయన తెలిపారు.
News January 4, 2026
2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం: మోదీ

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. పదేళ్లలో ఫిఫా అండర్-17, హాకీ ప్రపంచ కప్ వంటి 20కి పైగా అంతర్జాతీయ ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. క్రీడారంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ.. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణతో పాటు, ఒలింపిక్స్‌ను నిర్వహించడమే లక్ష్యమని 72వ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు.
News January 4, 2026
చంద్రబాబు స్వార్థ రాజకీయాలతో రాయలసీమకు అన్యాయం: అంబటి

AP: TG CM రేవంత్‌రెడ్డితో చంద్రబాబు కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలు రాయలసీమకు మరణశాసనంగా మారాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. స్వార్థం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకున్నారన్నారు. గతంలో ఆల్మట్టి, పోలవరం, ప్రత్యేక హోదా విషయంలోనూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. అధికారం కోసం AP ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్రాన్ని చంద్రబాబు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.


