News January 30, 2026

TG EAPCET షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ ఈఏపీ సెట్-2026(గతంలో ఎంసెట్) షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదేనెల 19 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 4,5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9 నుంచి జూన్ 11 వరకు ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

Similar News

News January 30, 2026

గొడవలో ‘వెళ్లి చావు’ అనడం నేరమా?.. కేరళ హైకోర్టు కీలక తీర్పు

image

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇవే ఆరోపణలతో అరెస్టయిన ఓ వ్యక్తి శిక్షను రద్దు చేసింది. ప్రాసిక్యూషన్ ప్రకారం.. భర్త అక్రమ సంబంధంపై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో భర్త ‘వెళ్లి.. చావు’ అని భార్యతో అన్నాడు. దీంతో ఆమె కూతురితో కలిసి సూసైడ్ చేసుకోవడంతో భర్తపై నమోదైన కేసును సెషన్స్ కోర్టు సమర్థించగా, హైకోర్టు కొట్టేసింది.

News January 30, 2026

నెయ్యి పేరుతో YCP రూ.250కోట్ల కుంభకోణం: జనసేన

image

AP: నెయ్యి వాడకుండానే దాని పేరుతో YCP ప్రభుత్వం రూ.250కోట్ల కుంభకోణం చేసిందని జనసేన ఆరోపించింది. ‘‘ఆవు నెయ్యికి బదులు ప్రమాదకర రసాయనాలతో 68లక్షల కిలోల సింథటిక్ నెయ్యి వాడి లడ్డూ ప్రసాదాన్ని TTD గత పాలకులు దోపిడీకి కేంద్రంగా చేసుకున్నారు. నెయ్యి సేకరణలో కుట్ర, ఫేక్ డాక్యుమెంట్ల వినియోగం, అధికార దుర్వినియోగంపై ఆధారాలున్నట్టు CBI నేతృత్వంలోని SIT దర్యాప్తులో తేలింది’’ అని SMలో పోస్టు పెట్టింది.

News January 30, 2026

‘వారణాసి’ మూవీ రిలీజ్ తేదీ ప్రకటించిన జక్కన్న

image

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘వారణాసి’ రిలీజ్ తేదీని దర్శక ధీరుడు రాజమౌళి ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.