News February 19, 2025
TG-EAPCET-25 నోటిఫికేషన్ రేపే విడుదల

జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న TG-EAPCET 2025 పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ గురువారం విడుదల చేస్తున్నట్లు కన్వీనర్ డీన్ కుమార్ వెల్లడించారు. ఈనెల 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా https://eapcet.tgche.ac.in ద్వారా తమని సంప్రదించవచ్చని వెల్లడించారు.
Similar News
News July 5, 2025
బాపట్లలో ఎలక్ట్రికల్ ఆటోల అందజేత

ప్రజల జీవనోపాధులు మెరుగుపరచుకోవడానికి మెప్మా శాఖ ద్వారా చీరాల మండలంలో 2, బాపట్ల మండలంలో 2 ఎలక్ట్రికల్ ఆటోలను ముద్రా రుణం కింద కలెక్టర్ వెంకట మురళి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ లబ్ధిదారులకు అందజేశారు. ఒక్కొక్క యూనిట్ ఖరీదు రూ.3.63 లక్షలు అన్నారు. ఈ వాహనాలను రాపిడో సంస్థతో అనుసంధానించడం ద్వారా లబ్ధిదారులకు రూ.56 వేల ప్రోత్సాహకం అందజేస్తామన్నారు.
News July 5, 2025
MBNR: BJP కొత్త సారథి.. అభినందించిన డీకే అరుణ

హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్.రాంచందర్ రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాలమూరు ఎంపీ, జాతీయ కౌన్సిల్ మెంబెర్ డీకే అరుణ నూతన ఆయన్ను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News July 5, 2025
వైసీపీ కర్నూలు జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా ఉస్మాన్ సాహెబ్

వైసీపీ కర్నూలు జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా గోనెగండ్లకు చెందిన కార్యకర్త ఉస్మాన్ సాహెబ్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఉస్మాన్ సాహెబ్ మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్త అయిన తనకు అధిష్ఠానం జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుక, ఎంపీపీ నస్రుద్దీన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.