News August 23, 2025
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు TG సర్కార్?

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంపై ఇవాళ్టి PAC సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ రిజర్వేషన్ల అంశం తేలకపోతే పార్టీ పరంగా 42% సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News August 23, 2025
రిజర్వేషన్లు, ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక సమీక్షలు

TG: బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై CM రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమీక్షలు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో PCC కోర్ కమిటీతో సమావేశమయ్యారు. మీనాక్షి, భట్టి, మహేశ్, ఉత్తమ్, శ్రీధర్ బాబుతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం గాంధీభవన్‌కు వెళ్లారు. అక్కడ జరిగే PAC సమావేశంలో BC రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు.
News August 23, 2025
కొత్త బిజినెస్‌లోకి DREAM SPORTS!

ఆన్‌లైన్ గేమింగ్ చట్టంతో డ్రీమ్11 తమ ఆర్థిక లావాదేవీలను ఆపేసింది. ఈ నేపథ్యంలో దీని పేరెంట్ కంపెనీ డ్రీమ్ స్పోర్ట్స్.. ‘డ్రీమ్ మనీ’ పేరిట కొత్త యాప్‌ను టెస్ట్ చేస్తున్నట్లు మనీ కంట్రోల్ తెలిపింది. ఇందులో రోజుకు రూ.10 నుంచే డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడి పెట్టొచ్చు. ఇందుకోసం డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్ Augmontతో చేతులు కలిపింది. అలాగే బ్యాంక్ ఖాతా లేకుండానే కనీసం రూ.1000తో FD చేసే అవకాశం కల్పించనుంది.
News August 23, 2025
ఈ చెట్టుతో ప్రధాని భద్రతకు సమస్యలు

పార్లమెంట్ కొత్త భవనంలో గజ ద్వారం వద్ద ‘No.1 చెట్టు’తో PM భద్రతకు సమస్యలు తలెత్తుతున్నట్లు SPG గుర్తించింది. మోదీ తరచూ ఈ ద్వారం నుంచే సభలోకి వెళ్తుంటారని, చెట్టును అక్కడి నుంచి వేరే చోటుకు మార్చాలని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటుకు తెలిపింది. ఇందుకోసం అటవీశాఖ అనుమతి కావాలి. ఇప్పటికే రూ.57వేలు డిపాజిట్ చేశారు. ఈ చెట్టును తరలిస్తున్నందుకు పార్లమెంట్ ప్రాంగణంలోనే 10మొక్కలు నాటాల్సి ఉంటుంది.