News March 21, 2026

TG SET ఫలితాలు విడుదల

image

TG సెట్-2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 2,565 మంది అర్హత సాధించారు. అధికారిక <>వెబ్‌సైట్‌<<>>లో రిజర్వేషన్ల వారీగా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు పొందుపరిచారు. హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి స్కోర్‌కార్డును పొందవచ్చు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ పరీక్ష జరిగింది. మరోవైపు టీజీ సెట్‌-2026 నోటిఫికేషన్​ మే నెలలో విడుదలవనుంది. అక్టోబర్‌లో ఎగ్జామ్ జరగనుంది.

Similar News

News March 31, 2026

PHOTOS: కోదండరాముడి కళ్యాణానికి ముస్తాబైన ఒంటిమిట్ట

image

AP: ఒంటిమిట్టలో రేపు జరగబోయే కోదండరాముడి కళ్యాణానికి TTD భారీ ఏర్పాట్లు చేసింది. వేడుక జరిగే ప్రధాన వేదికతో పాటు భక్తులు కూర్చొనేందుకు ఆలయ సమీపంలో గ్యాలరీలు ఏర్పాటయ్యాయి. వేలాదిగా తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించనుంది. అలాగే కళ్యాణం అనంతరం తలంబ్రాల ప్యాకెట్లు, శ్రీవారి ప్రసాదం ఇవ్వనుంది. సీఎం చంద్రబాబు రేపు సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొననున్న విషయం తెలిసిందే.

News March 31, 2026

రోహిత్ ఔట్ కాగానే టీవీ ఆఫ్ చేస్తా: బట్లర్

image

KKRతో మ్యాచ్‌లో MI ఓపెనర్ రోహిత్ ఇన్నింగ్స్(78)పై GT స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ ఓ పాడ్‌కాస్ట్‌లో ప్రశంసలు కురిపించారు. హిట్‌మ్యాన్ తన ఫేవరెట్ క్రికెటర్ అని తెలిపారు. తానెప్పుడూ అతని బ్యాటింగ్ చూస్తూ ఉంటానన్నారు. సాధారణంగా టీవీ ఎక్కువగా చూడనని, రోహిత్ బ్యాటింగ్ కోసమే దాన్ని ఆన్ చేస్తానని తెలిపారు. హిట్ మ్యాన్ ఔట్ కాగానే టీవీ ఆఫ్ చేస్తానని వెల్లడించారు. గతంలో బట్లర్ ముంబై తరఫున ఆడిన విషయం తెలిసిందే.

News March 31, 2026

ఒరాకిల్ ఝలక్.. 30,000 మందికి లేఆఫ్స్

image

AI, డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెడుతున్న సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ తమ ఉద్యోగులను మరోసారి తొలగిస్తోంది. తమకు లేఆఫ్స్ మెయిల్స్ వచ్చినట్లు పలువురు ఉద్యోగులు SMలో పోస్టులు పెడుతున్నారు. ఈ కంపెనీకి భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా 1,62,000 మంది ఉద్యోగులు ఉండగా దాదాపు 18% అంటే 20,000 నుంచి 30,000 మందిని తొలగిస్తోందని నివేదికలు చెబుతున్నారు. 2023 నుంచి పలుమార్లు ఒరాకిల్ లేఆఫ్స్ ప్రకటించింది.