News January 15, 2025
కృష్ణా జలాల్లో మెజారిటీ వాటా TGకే దక్కాలి: మంత్రి ఉత్తమ్

కృష్ణా జలాల విషయంలో TGకి అన్యాయం జరగొద్దని మంత్రి ఉత్తమ్ అన్నారు. రేపు కృష్ణానది జలవివాదంపై విచారణ ఉన్న నేపథ్యంలో ట్రిబ్యునల్కు నివేదించాల్సిన అంశాలపై ఢిల్లీలో సమీక్షించారు. ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. TGలో సాగు విస్తీర్ణం ఎక్కువని, మెజారిటీ వాటా రాష్ట్రానికే దక్కాలని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ఒప్పుకున్న ప్రతిపాదనను తాము అంగీకరించడం లేదని స్పష్టం చేశారు.
Similar News
News November 7, 2025
స్వర్గమంటే ఇదే.. హిమాచల్ అందాలు చూడండి!

వింటర్ వెకేషన్కు విదేశాలకు వెళ్లే పర్యాటకులను ఆకర్షించేందుకు హిమాచల్ ప్రదేశ్ టూరిజం సంస్థలు స్థానిక అందాలను SMలో పంచుకుంటున్నాయి. ప్రస్తుతం అక్కడ చెట్ల ఆకులన్నీ నారింజ రంగులోకి మారి, ప్రశాంత వాతావరణంతో భూతల స్వర్గంలా మారింది. ‘ఇది నార్వే కాదు.. హిమాచల్ప్రదేశ్’ అంటూ ‘Go Himachal’ పోస్ట్ చేసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సీజన్లో కులు మనాలీ, సిమ్లా వంటి ప్రదేశాలు పర్యాటకులతో కిటకిటలాడనున్నాయి.
News November 7, 2025
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఉద్యోగాలు

తిరుపతిలోని <
News November 7, 2025
హనుమాన్ చాలీసా భావం – 2

రామదూత అతులిత బలధామా |
అంజనిపుత్ర పవనసుత నామా ||
ఇది ఆంజనేయుడి గొప్పదనాన్ని వివరిస్తుంది. హనుమాన్ రాముడికి నమ్మకమైన దూత(రామదూత). ఆయన బలం కొలవలేనిది, అపార శక్తిమంతుడు(అతులిత బలధామా). ఆయన అంజనీదేవి కుమారుడు(అంజనిపుత్ర), వాయుదేవుని పుత్రుడు(పవనసుత). శ్రీరాముడి విజయం, ధర్మ స్థాపనలో హనుమంతుని పాత్ర కీలకం. ఆయనను స్మరిస్తే శక్తి, విజయం లభిస్తాయి. <<-se>>#HANUMANCHALISA<<>>


