News January 1, 2025

విశ్వ వేదికపై విజయ గీతికగా TG ప్రస్థానం ఉండాలి: CM

image

TG: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘నవ వసంతంలో విశ్వ వేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం, ప్రస్థానం ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి,రజినీకాంత్, కమల్ హాసన్, ఎన్టీఆర్ తదితరులు కూడా X వేదికగా న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు.

Similar News

News January 4, 2025

కెనడాలో పుష్ప-2 ఆల్‌టైమ్ రికార్డ్

image

దేశవిదేశాల్లో పుష్ప-2 రికార్డుల మోత కొనసాగిస్తోంది. తాజాగా కెనడాలో 4.13 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ క్రమంలో ‘కల్కి 2898ఏడీ’ కలెక్షన్లను అధిగమించింది. కెనడాలో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సౌత్ ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. మొత్తంగా మూవీ రూ.1800కోట్ల మార్కును దాటిన సంగతి తెలిసిందే.

News January 4, 2025

మళ్లీ బండి సంజయ్‌కే టీబీజేపీ పగ్గాలు?

image

TG: రాష్ట్రంలో బీజేపీ పగ్గాల్ని మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కే మరోమారు ఇవ్వాలని ఆ పార్టీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. ఇక సీనియర్ నేత ఈటల రాజేందర్‌కు కేంద్రమంత్రి పదవిని ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బీజేపీని సంజయ్ పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. కాగా.. అధ్యక్ష రేసులో ప్రస్తుతం ఎంపీలు అరవింద్, రఘునందన్‌రావు, డీకే అరుణ, ఈటల ఉన్నారు.

News January 4, 2025

ఏపీలో 7 కొత్త ఎయిర్‌పోర్టులు

image

ఏపీలో కొత్తగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో 7 ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టు ఫీజిబిలిటీ సర్వే పూర్తైంది. మిగతాచోట్ల సర్వే చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుతో జరిగిన సమీక్షలో CM చంద్రబాబు కోరారు. అటు గన్నవరంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్‌తో నిర్మించనున్నారు.