News March 26, 2025

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకం మార్గదర్శకాలు ఇవే

image

☛ 5 ఏళ్లలో ఒక్కో కుటుంబం ఒక్కసారి మాత్రమే లబ్ధి పొందాలి
☛ కుటుంబాల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2లక్షలు, పల్లెల్లో రూ.1.50లక్షలలోపు ఉండాలి
☛ రేషన్ కార్డు లేకపోతే ఇన్‌కం సర్టిఫికెట్ సమర్పించాలి
☛ మహిళలకు (ఒంటరి, వితంతు) 25%, దివ్యాంగులకు 5% రిజర్వేషన్
☛ అమరవీరుల కుటుంబాలు, స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యత
☛ <>ఆన్‌లైన్‌లో<<>> మాత్రమే దరఖాస్తులు

Similar News

News March 26, 2025

DSP స్థాయిలో ప్రవీణ్ మృతిపై దర్యాప్తు: అనిత

image

AP: పాస్టర్ <<15892230>>ప్రవీణ్ పగడాల<<>> మృతిపై లోతుగా విచారణ చేయిస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. కేసును DSP స్థాయిలోని అధికారుల కమిటీ విచారణ చేస్తోందన్నారు. ఆయన మృతిని రోడ్డు ప్రమాదం అనే కోణంలోనే పరిగణించడం లేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అనుమానాస్పద మృతిగా FIR నమోదు అయిందని, ఘటనాస్థలం వద్ద కాల్ డేటా సేకరిస్తున్నట్లు వివరించారు. మతపరమైన విద్వేషాలు రగిలేలా ఎవరూ వ్యవహరించవద్దని కోరారు.

News March 26, 2025

విద్యార్థులకు వాటర్ బెల్.. విద్యాశాఖ ఉత్తర్వులు

image

AP: ఎండలు తీవ్రమైన నేపథ్యంలో పాఠశాలలో రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ అమలు చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉ.10, 11, మ.12 గంటలకు వాటర్ బెల్ పాటించాలని పేర్కొంది. విద్యార్థులు నీళ్లు తాగేలా ఉపాధ్యాయులు చూడాలని తెలిపింది.

News March 26, 2025

ఓటీటీలో అదరగొడుతున్న ‘గేమ్ ఛేంజర్’

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. రూ.450కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 7న జీ5లో హిందీ వెర్షన్ విడుదలైంది. తొలి రోజు నుంచి ఇప్పటి వరకు టాప్-10లో దూసుకెళ్తున్నట్లు జీ5 తెలిపింది. 250మిలియన్ మినిట్స్‌కు పైగా వ్యూస్ సాధించినట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

error: Content is protected !!