News December 28, 2024
నేటి నుంచి 4 రోజులు TGB సేవలు బంద్

TG: ఏపీజీవీబీ బ్రాంచ్‌లు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమవుతున్న నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 31 వరకు TGB సేవలు నిలిచిపోనున్నట్లు ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. జనవరి 1 నుంచి సేవలు పునరుద్ధరిస్తామని చెప్పారు. బ్రాంచ్‌ల విలీనం జరిగినా ఖాతా నంబర్లు మారవని స్పష్టం చేశారు. కస్టమర్ల అత్యవసరాల నిమిత్తం ఈ నెల 30, 31 తేదీల్లో రూ.10వేల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.
Similar News
News December 6, 2025
INDvsSA.. ఇద్దరు ప్లేయర్లు దూరం!

భారత్‌తో మూడో వన్డేకు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ బర్గర్, బ్యాటర్ టోనీ డి జోర్జి గాయాల కారణంగా దూరమయ్యారు. జోర్జి T20 సిరీస్‌కూ దూరమైనట్లు SA బోర్డు వెల్లడించింది. టీ20లకు ఎంపికైన పేసర్ మఫాకా ఇంకా కోలుకోలేదని, అతడి స్థానంలో సిపమ్లాను ఎంపిక చేసినట్లు తెలిపింది. కాగా తొలి వన్డేలో 39 రన్స్ చేసిన జోర్జి, రెండో వన్డేలో 17పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. బర్గర్ 2 మ్యాచుల్లో 3 వికెట్లు తీశారు.
News December 6, 2025
ధనికులకు దండాలు.. పేదలకు దండనా?.. రైల్వే తీరుపై విమర్శలు

ఇండిగో ఫ్లైట్స్ రద్దవడంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్రత్యేక <<18483830>>రైళ్లను<<>>, 37 రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొస్తున్నాయి. ‘సామాన్యుల రద్దీతో జనరల్ బోగీలు నిండిపోయి ఇబ్బంది పడుతున్నా మా కోసం ఎప్పుడైనా అదనపు బోగీలు వేశారా? ధనవంతులకి ఒక న్యాయం, పేదవాడికి మరో న్యాయమా?’ అని మండిపడుతున్నారు. పండుగల సమయాల్లోనైనా బోగీలు పెంచాలంటున్నారు.
News December 6, 2025
ఆడపిల్ల పుడితే రూ.10,000.. పండుగకు రూ.20,000!

TG: పంచాయతీ ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. సిరిసిల్ల(D) ఆరేపల్లిలో ఓ అభ్యర్థి ఎవరికైనా ఆడపిల్ల జన్మిస్తే ఆమె పేరిట రూ.10వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు మెదక్(D) కాప్రాయిపల్లిలో ఓ అభ్యర్థి ఏకంగా 15 హామీలను బాండ్ పేపర్‌పై రాసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో ఆడపిల్ల పుడితే ₹2వేలు, తీజ్ పండుగకు ₹20వేలు, అంత్యక్రియలకు ₹5వేలు వంటి హామీలున్నాయి.


