News December 3, 2024

TGPSC ఛైర్మన్ నియామకంపై ఆళ్ల హర్షం

image

TGPSC ఛైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియామకం పట్ల ఓబీసీ హక్కుల పరిరక్షణ జాతీయ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. బీసీ వ్యక్తికి కమిషన్ సారథిగా అవకాశం కల్పించాలని నవంబర్ 16న సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News December 5, 2024

HYD: పాన్ కార్డు కరెక్షన్స్.. ఇది మీ కోసమే!

image

HYD అమీర్‌పేట స్వర్ణ భారతి కాంప్లెక్స్ భవనంలో CSC హెడ్ ఆఫీసులో పాన్ కార్డు, పాస్ పోర్టు సర్వీసులు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాన్ కార్డులో పేరు, DOB మార్పులు చేర్పులు కూడా చేస్తామన్నారు. మిగతా సర్వీసులు సైతం అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
SHARE IT

News December 4, 2024

HYD: తార్నాక IICTలో ఉద్యోగాలు

image

55% మార్కులతో 10TH, ఇంటర్, ITI చేసిన అభ్యర్థులకు శుభవార్త. HYD తార్నాకలోని CSIR-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT) టెక్నీషియన్‌ విభాగంలో 29 ఖాళీలు ఉన్నాయి. భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రూ. 500 చెల్లించి అప్లై చేసుకోవచ్చు. SC, ST, మహిళా అభ్యర్థులు ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ: 26-12-2024.

SHARE IT

News December 4, 2024

HYDలో పెరిగిన కోడిగుడ్ల ధరలు

image

రాష్ట్ర వ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు పెరిగాయి. హోల్ సేల్ మార్కెట్లో ధర రూ.5.90గా NECC నిర్ణయించింది. దీంతో HYDలోని పలు ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7 వరకు అమ్ముతున్నారు. 4నెలల క్రితంతో పోల్చితే రూ.3 వరకు పెరిగాయి. చలికాలంలో గుడ్ల వినియోగం పెరగడంతో, క్రిస్మస్, న్యూ ఇయర్‌కు కేకులు తయారీలో వాడుతుండటంతో రేట్లు పెరిగినట్లు అమ్మకదారులు తెలిపారు. ధరలు మరింత పెరగుతాయని అంచనా.