News July 19, 2024
TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డికి భట్టి ఫోన్

TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. DECలో గ్రూప్-2 నిర్వహణపై పరిశీలించాలని కోరారు. అంతకుముందు సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులతో చర్చించిన భట్టి.. పరీక్ష వాయిదాపై సానుకూలంగా స్పందించారు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయి. త్వరలో వాయిదాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Similar News
News November 14, 2025
పోస్టల్ బ్యాలెట్: కాంగ్రెస్ ముందంజ

TG: జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఈ ఉపఎన్నికలో 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నవీన్ ఇందులో లీడింగ్లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుండగా, ఎన్ని ఓట్లు అనేది కాసేపట్లో వెల్లడికానుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగియగా ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత షేక్పేట డివిజన్ ఓట్లను కౌంట్ చేస్తున్నారు.
News November 14, 2025
కౌంటింగ్ షురూ..

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. జూబ్లీహిల్స్లో 2, 3 గంటల్లో ఫలితాల సరళి తెలియనుంది. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. అటు బిహార్లో 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
News November 14, 2025
ఈనెల 17న జాబ్ మేళా

AP: ఈనెల 17న పార్వతీపురం Employment Office ఆధ్వర్యంలో ఆన్లైన్ జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. 18ఏళ్లు పైబడిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. మొత్తం 1150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ముందుగా https://rb.gy/68z9mn లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


