News March 18, 2025
TGPSC ఫలితాల్లో సత్తా చాటిన ‘అయిజ’ యువతి

సోమవారం TGPSC విడుదల చేసిన ఫలితాల్లో అయిజ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన రాణెమ్మ దేవన్న చిన్న కుమార్తె అయిన సునీత గట్టు గురుకులాల్లో చదివి, SC స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుని హాస్టల్ వెల్ఫేర్ ఫలితాల్లో సత్తాచాటిన ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని సునీత తెలిపింది. ఉద్యోగం సాధించినందుకు తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందించారు.
Similar News
News April 18, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలో పగలు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రామగిరి 41.5 నమోదు కాగా పాలకుర్తి 41.2, అంతర్గం 40.1, పెద్దపల్లి 40.0, రామగుండం 39.6, సుల్తానాబాద్ 39.6, ధర్మారం 39.6,ఓదెల 39.5, కాల్వ శ్రీరాంపూర్ 39.2, కమాన్పూర్ 38.9, ముత్తారం 38.5, ఎలిగేడు 38.4, మంథని 38.2, జూలపల్లి 38.1℃ గా నమోదయ్యియి.
News April 18, 2025
డాక్టరేట్ అందుకున్న నగరం వాసి సత్యనారాయణ

మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారుడు, కళా భూషణ్ మంగం సత్యనారాయణ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ NT రామారావు కళామందిర్‌లో నిన్న జరిగిన సమావేశంలో శ్రీపొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన డాక్టరేట్ అవార్డుతో సత్యనారాయణను సత్కరించింది. ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
News April 18, 2025
సిరిసిల్ల: ఎయిర్ ఫోర్స్ అగ్ని వీర్లో ఉద్యోగాలు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీం ద్వారా వీర్ వాయు సంగీత విభాగంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్ తెలిపారు. ఈనెల 21వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు https://agnipathvayu.cdac.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఫ్రీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనుటకు ప్రొవిజినల్ అడ్మిట్ కార్డు పొందుతారన్నారు.