News July 19, 2024

TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డికి భట్టి ఫోన్

image

TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. DECలో గ్రూప్-2 నిర్వహణపై పరిశీలించాలని కోరారు. అంతకుముందు సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులతో చర్చించిన భట్టి.. పరీక్ష వాయిదాపై సానుకూలంగా స్పందించారు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయి. త్వరలో వాయిదాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Similar News

News December 26, 2024

సీఎంతో భేటీపై నిర్మాణ సంస్థ ట్వీట్

image

సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన మీటింగ్‌పై నిర్మాణ సంస్థ SVC ట్వీట్ చేసింది. ‘తెలంగాణ ప్రభుత్వం & టాలీవుడ్ ప్రతినిధుల మధ్య ఫలప్రదమైన సమావేశం జరిగింది. సీఎం రేవంత్ దూరదృష్టి గల నాయకత్వాన్ని అభినందిస్తున్నాం. షూటింగ్‌లకు HYDని గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు DY.CM భట్టి, మంత్రి కోమటిరెడ్డి కట్టుబడి ఉన్నారు. టాలీవుడ్ TG ప్రభుత్వానికి మద్దతునిస్తుంది. డ్రగ్స్ నిర్మూలన పోరాటంలో పాల్గొంటుంది’ అని తెలిపింది.

News December 26, 2024

ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ నిర్మించనున్న చైనా

image

ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా సిద్ధమవుతోంది. టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్‌బో(బ్రహ్మపుత్ర) నదిపై దీన్ని నిర్మించనుంది. పూర్తైతే ఏడాదికి 300 బిలియన్ కిలో‌వాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. దీని కోసం భారీగా నిధులు వెచ్చించనున్నట్లు బీజింగ్ వర్గాలు తెలిపాయి. బ్రహ్మపుత్ర నది భారత్‌లోని అరుణాచల్, అస్సాం రాష్ట్రాల మీదుగా బంగ్లాదేశ్‌లోకి వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తుంది.

News December 26, 2024

అజెర్‌బైజాన్ విమానాన్ని కూల్చేశారా?

image

అజెర్‌బైజాన్‌లో నిన్నటి విమాన ప్రమాదం రష్యా దాడి వల్లే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఫ్లైట్ అజెర్‌బైజాన్‌లోని బాకు సిటీ నుంచి రష్యాకు వెళ్తుండగా కుప్పకూలింది. ఆ సమయానికి రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. విమానాన్ని ఉక్రెయిన్ దాడిగా పొరబడి రష్యా ఎయిర్ డిఫెన్స్ దాన్ని కూల్చేసి ఉండొచ్చని పలువురు ఆరోపిస్తున్నారు. విమానం బాడీపై బులెట్ల ఆనవాళ్లుండటం దీనికి ఊతమిస్తోంది.