News February 23, 2026

TGPSC వన్ టైమ్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు

image

TG: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్‌డేట్ చేసుకునే గడువును మార్చి 25కు పొడిగిస్తున్నట్లు TGPSC ప్రకటించింది. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో నింపే సమాచారానికి ఓటీఆర్ డేటానే ప్రాథమిక ఆధారం అవుతుందని తెలిపింది. అధికారిక వెబ్‌సైట్ <>https://www.tgpsc.gov.in<<>> ద్వారా తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

Similar News

News February 25, 2026

T20 WC: కివీస్‌తో మ్యాచ్.. లంక బౌలింగ్

image

న్యూజిలాండ్‌‌తో జరుగుతున్న కీలక మ్యాచులో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సూపర్-8లో ఇప్పటికే ఇంగ్లండ్ చేతిలో ఓడిన లంక ఈ మ్యాచులో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడితే ఇంటిబాట పడుతుంది. అటు పాక్‌తో మ్యాచు వర్షం కారణంగా రద్దవడంతో కివీస్‌కూ ఈ మ్యాచులో గెలవడం తప్పనిసరిగా మారింది. టీమ్స్ వివరాలు పైన ఇమేజ్‌లో చూడొచ్చు. మరి ఇవాళ ఎవరు విజయం సాధిస్తారని అనుకుంటున్నారు? COMMENT

News February 25, 2026

ఇజ్రాయెల్ ప్రతిపాదనను భారత్ అంగీకరిస్తుందా?

image

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని నెతన్యాహు అంతకుముందు ప్రతిపాదించిన ‘Hexagon of Alliances’ చర్చనీయాంశమైంది. మిడిల్‌ ఈస్ట్‌లో తీవ్రవాదం పోరుకు భారత్‌ సహా ఆరు దేశాలతో కూటమి ఏర్పాటు చేయాలనేది నెతన్యాహు ప్రపోజల్. మోదీతో భేటీలో దీనిని ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే ఇది పరోక్షంగా ఇరాన్‌‌ను టార్గెట్ చేసే అవకాశం ఉండటంతో మిత్రదేశమైన భారత్ దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం.

News February 25, 2026

Instagram స్పేస్ క్రియేట్ చేసుకుంటోంది

image

స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ టీవీలను టార్గెట్ చేసింది. గూగుల్ టీవీల్లో Instagram App లాంచ్ చేస్తున్నట్లు సంస్థ హెడ్ ఆడమ్ తెలిపారు. ప్రస్తుతానికి కుకింగ్, ట్రావెల్, ట్రెండింగ్ కంటెంట్‌తో USలో లాంచ్ చేస్తున్న ఈ యాప్ త్వరలో ఇతర దేశాల డివైజ్‌లకూ రావచ్చు. ఇప్పటికే TikTok, యూట్యూబ్ షార్ట్స్ TV యాప్స్ ఉండగా.. వాటికి పోటీగా, తనకు అదనపు రెవెన్యూ సోర్స్‌ను మెటా క్రియేట్ చేసుకుంటోంది.