News November 20, 2024
ప్రజలకు TGPSC క్షమాపణలు చెప్పాలి: KTR
TG: గ్రూప్-3 ప్రశ్న పత్రంలో తక్కువ కులం, ఉన్నత కులం అనే పదాలు వాడారని డా.RS. ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్పై KTR స్పందించారు. ‘TGPSC ఈ రకమైన కులతత్వ ఎజెండాను ప్రోత్సహించడం సిగ్గుచేటు. దీనిపై కమిషన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని అన్నారు. ‘తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పదాలు ప్రభుత్వ పరీక్షా పత్రాల్లోనే ఉంటే ఇక సామాజిక న్యాయం ఎలా వస్తుంది రేవంత్ గారూ?’ అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
Similar News
News November 20, 2024
భాస్కర –II ఉపగ్రహం విశేషాలు
1981లో సరిగ్గా ఇదే రోజు రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రయోగ వేదిక నుంచి భాస్కర –II ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. 444KGS బరువు ఉండే ఈ శాటిలైట్ పని చేసే కాలం ఒక సంవత్సరం కాగా, ఇది పదేళ్లు కక్ష్యలో తిరిగింది. భూ పరిశీలన కోసం ప్రయోగించిన భాస్కర శ్రేణిలో ఇది రెండవ ఉపగ్రహం. గణిత శాస్త్రవేత్త మొదటి భాస్కరుడు గుర్తుగా దీనికి ఆ పేరు పెట్టారు. దీనికి ముందు 1979లో భాస్కర-I ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.
News November 20, 2024
నేడు వేములవాడకు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు వెళ్లనున్నారు. ఉ.10:10 నుంచి ఉ.11.45 గంటల మధ్యలో వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్ మానేరు నిర్వాసితుల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మ.1.45 తర్వాత HYDకు తిరుగు ప్రయాణమవుతారు.
News November 20, 2024
విడాకులపై ఏఆర్.రెహమాన్ ట్వీట్.. ఏమన్నారంటే?
భార్యతో విడాకులు తీసుకోవడంపై ఏఆర్.రెహమాన్ ట్వీట్ చేశారు. ‘మేము మా బంధంలో ముప్పై ఏళ్లు పూర్తి చేసుకోవాలనుకున్నాం. కానీ ఊహించని విధంగా ఇది ముగిసింది. విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుంది. విడిపోవడంలోనూ మేము అర్థాన్ని వెతుకుతాము. అయినప్పటికీ పగిలిన ముక్కలు మళ్లీ ఒక్కటి కాలేకపోవచ్చు. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించినందుకు అందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.