News September 11, 2025
గ్రూప్-1పై డివిజన్ బెంచ్‌కు TGPSC..!

TG: <<17655670>>గ్రూప్-1<<>> మెయిన్స్ ఫలితాల రద్దు తీర్పుపై అప్పీల్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించనున్నట్లు సమాచారం. ఈ అంశంపై కమిషన్ ఇవాళ సమావేశమైంది. బెంచ్ తీర్పును సవాల్ చేసేందుకు లీగల్ టీమ్ గ్రౌండ్స్ ప్రిపేర్ చేస్తోంది. వారం రోజుల్లో పిటిషన్ దాఖలు చేసే అవకాశమున్నట్లు TGPSC వర్గాలు తెలిపాయి.
Similar News
News March 11, 2026
2 రోజుల్లో ₹51,400 కోట్ల ఆయుధాలు

ఇరాన్ యుద్ధంలో అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. యుద్ధం మొదలైన మొదటి 48 గంటల్లోనే ట్రంప్ యంత్రాంగం సుమారు ₹51,400 కోట్ల విలువైన ఆయుధాలను వాడేసినట్లు సమాచారం. కేవలం క్షిపణులు, బాంబులకే ఇంత ఖర్చు కాగా.. సైనిక మోహరింపు వ్యయం అదనం. ఈ స్థాయిలో ఖర్చు చేయడం అమెరికా కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతటి భారీ ఖర్చుతో కూడిన యుద్ధాన్ని పెంటగాన్ ఎంతకాలం కొనసాగించగలదనే దానిపై చర్చలు మొదలయ్యాయి.
News March 11, 2026
ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే?

ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు బిడ్డకు కవచంలా ఉంటూ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే అమ్మకు ఆయాసం ఎక్కువవుతుంది. ఏడో నెల తర్వాతయితే మరింత ఇబ్బంది అవుతుంది. నొప్పులు తొందరగా వస్తాయి. నిర్ణీత కాలం కంటే ముందుగానే ప్రసవం అయిపోతుంది. ఒక్కోసారి బేబీ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఉమ్మనీరు ఎంత ఉందో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News March 11, 2026
టీమ్ ఇండియాపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు

T20WCలో భారత్ తమకు అనుకూలంగా పిచ్‌లను తయారుచేసుకుందనే ఆరోపణలను పాక్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీమ్ ఖండించారు. ‘ఇండియా ఫ్రెండ్లీ పిచ్‌లు తయారుచేసుకుందని లేదా అంపైర్లు వారికి అనుకూలంగా వ్యవహరించారని చాలా మంది అంటుంటారు. కానీ ఈ టోర్నమెంటులో పిచ్‌లు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి. కొన్నిసార్లు పరిస్థితులు ఇండియాకు ప్రతికూలంగా ఉన్నా మంచి ఆటతీరు కనబరిచారు. వాళ్లు మనకంటే చాలా బాగా ఆడారు’ అని ప్రశంసించారు.


