News March 11, 2025
TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ మృతి

సిరిసిల్ల జిల్లా TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ టి.గంగారం(55) ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సిరిసిల్లలోని ఓ భవనంలో ఆయన లిఫ్ట్ యాక్సిడెంట్కు గురై మృతి చెందారని బెటాలియన్ వర్గాలు తెలిపాయి. ఆయన మృతి పట్ల బెటాలియన్ అధికారులు, సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 27, 2025
అమరావతి రైతులు ఆందోళన వద్దు: పెమ్మసాని

రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. త్రీ మ్యాన్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. అమరావతి సమస్యలకు పరిష్కారం చూపుతూనే, రాజధాని పనులు వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. రాబోయే 6 నెలల్లో రాజధానికి అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తిచేసే దిశగా పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు. మరో 4 రోజుల్లో జరగబోయే 2వ సమావేశంలో రైతులకు పూర్తి వివరాలు చెప్తామన్నారు.
News November 27, 2025
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఉన్నతాధికారులు

నల్గొండ: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు ఐఏఎస్ అధికారిణి కొర్ర లక్ష్మీ గురువారం పలు కేంద్రాలను సందర్శించారు. నార్కట్పల్లి గ్రామ పంచాయతీ, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఆమెతో పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ, ఆర్డీఓ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
News November 27, 2025
సిరిసిల్ల: చెప్పులు, చెత్త డబ్బా.. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులివే

సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులను ఎస్ఈసీ కేటాయించింది. వీటిలో చెప్పులు, చెత్త డబ్బా, బిస్కెట్, బెండకాయ, రింగు, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్, లేడీస్ పర్స్, రిమోట్, టూత్ పేస్ట్, బ్లాక్ బోర్డు, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జాలి, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్మెన్, పడవ, ఫ్లూట్, చైన్, బెలూన్, స్టంప్స్, స్పానర్ గుర్తులుండగా వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించింది.


