News March 11, 2025

TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ మృతి

image

సిరిసిల్ల జిల్లా TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ టి.గంగారం(55) ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సిరిసిల్లలోని ఓ భవనంలో ఆయన లిఫ్ట్ యాక్సిడెంట్‌కు గురై మృతి చెందారని బెటాలియన్ వర్గాలు తెలిపాయి. ఆయన మృతి పట్ల బెటాలియన్ అధికారులు, సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 6, 2026

జీలుగుమిల్లి: స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు

image

తాటియాకులగూడెం సరిహద్దు వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 598 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, వాహనం, సెల్ ఫోన్లతో పాటు రూ.2.98 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 6, 2026

DMHOపై భూపాలపల్లి ఎమ్మెల్యే ఆగ్రహం

image

భూపాలపల్లి జిల్లాలో నేడు హెల్త్ మిషన్ 100 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి DMHO మధుసూదన్ గైర్హాజరవడంతో తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని అధికారులను మందలించారు.

News March 6, 2026

మాస్ కాఫీయింగ్ జరిగితే చర్యలు: కలెక్టర్

image

ఏలూరులోని పీడీబీటీ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని, మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇన్విజిలేటర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె సూచించారు.