News July 11, 2024

TGSRTC ఖమ్మం వైద్య అధికారి బదిలీ

image

ఉమ్మడి ఖమ్మం రీజియన్ TGSRTC వైద్యాధికారి డాక్టర్ గిరి సింహారావు బదిలీ అయ్యారు. సుదీర్ఘకాలంగా ఇక్కడ పని చేస్తున్న ఆయన మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. ఉన్నతాధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం ఆయన విధుల నుంచి రిలీవ్ అయ్యారు. గత 25 సంవత్సరాల పైగా ఖమ్మం రీజియన్‌లో ఆయన సేవలో అందించారు.

Similar News

News December 22, 2025

పర్యాటక ప్రాంతాల వివరాలు పంపండి: ఖమ్మం కలెక్టర్

image

అన్ సీన్ పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో సోమవారం 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ కాంటెస్ట్ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. నేచర్, వైల్డ్ లైఫ్, హెరిటేజ్, వాటర్ బాడీస్, స్పిరిచువల్, అడ్వెంచర్, ఆర్ట్ అండ్ కల్చర్ వంటి విభాగాల్లోని ప్రదేశాల వివరాలను జనవరి 5లోపు పంపాలని సూచించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు.

News December 22, 2025

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News December 22, 2025

ఖమ్మం: 290 మంది కుష్టు వ్యాధి అనుమానితుల గుర్తింపు

image

ఖమ్మం జిల్లాలో కుష్టు నిర్మూలనే లక్ష్యంగా జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ నెల 18 నుంచి 1,339 మంది ఆశా కార్యకర్తలు 50 వేల ఇళ్లను సందర్శించి 1.61లక్షల మందిని పరీక్షించారు. ఇప్పటివరకు 290 మంది అనుమానితులను గుర్తించినట్లు DMHO డాక్టర్ రామారావు తెలిపారు. వీరికి తుది పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తామన్నారు.. లక్షణాలుంటే భయం వీడి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.