News June 25, 2024
జర్నలిస్టుల బస్పాస్లపై TGSRTC నిర్ణయం

TG: సాంకేతిక కారణాల వల్ల అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టుల బస్పాస్ల అప్లికేషన్లను ఆన్లైన్లో స్వీకరించడం లేదని TGSRTC ప్రకటించింది. జూన్ 26వ తేదీ నుంచి సమీపంలోని బస్పాస్ సెంటర్లకు నేరుగా వెళ్లి పాస్లు తీసుకోవాలని సూచించింది. జర్నలిస్టులు తమ అక్రిడిటేషన్ కార్డు, పాత బస్పాస్ చూపించి కొత్తవి తీసుకోవాలని కోరింది.
Similar News
News November 7, 2025
మన హాకీకి వందేళ్లు.. పూర్వవైభవం సాధిద్దాం

స్వాతంత్య్రానికి ముందే భారత్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన క్రీడ హాకీ. 1925 NOV 7న మన హాకీకి IHF గుర్తింపు లభించింది. ఆ ఘనతకు నేటితో వందేళ్లు. 1926లో తొలి అంతర్జాతీయ పర్యటనకు న్యూజిలాండ్ వెళ్లిన భారత్ 21 మ్యాచుల్లో 18 గెలిచింది. 1958 వరకు వరుసగా ఆరు, 1964, 1980లో ఒలింపిక్స్ స్వర్ణాలు, 1975లో WC సాధించింది. ఆ తర్వాత హాకీ ప్రాభవాన్ని కోల్పోయింది. పదేళ్లుగా పూర్వవైభవం కోసం కృషి జరుగుతోంది.
News November 7, 2025
రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ రివ్యూ&రేటింగ్

టాక్సిక్ రిలేషన్షిప్లో చిక్కుకుని దాన్నుంచి బయటపడలేక నలిగిపోయిన ఓ అమ్మాయి కథే ‘ది గర్ల్ ఫ్రెండ్’. పైకి నవ్వుతున్నట్లు కనిపించినా లోపల అంతులేని బాధను అనుభవించే పాత్రలో రష్మిక అదరగొట్టారు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కథను చెప్పిన విధానం బాగుంది. సాంగ్స్, BGM ప్రధాన బలం. ఎమోషన్లకు పెద్దపీట వేయడంతో స్టోరీ స్లోగా సాగినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్లో అనవసర సీన్లు, కథ ఊహించేలా ఉండటం మైనస్.
RATING: 2.75/5
News November 7, 2025
ఇతిహాసాలు క్విజ్ – 59

1. అర్జునుడి శంఖం పేరేంటి?
2. రుక్మిణి సోదరుడు ఎవరు?
3. అట్ల తద్ది పండుగ ఏ మాసంలో వస్తుంది?
4. సుమంత్రుడు ఎవరి రథసారథి?
5. తిరుపతిలో తలనీలాలు సమర్పించే స్థలాన్ని ఏమంటారు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>


