News August 16, 2024
ప్రయాణికులకు TGSRTC గుడ్న్యూస్

TG: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల కొనుగోళ్లకు త్వరలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని తీసుకొస్తామని TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్, బండ్లగూడ డిపోల్లో ఇది అమలు అవుతోందన్నారు. కొద్దిరోజుల్లోనే అన్ని డిపోల్లో అందుబాటులోకి తెస్తామని వివరించారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో అటు కండక్టర్లకు, ఇటు ప్రయాణికులకు ‘చిల్లర’ కష్టాలు తప్పనున్నాయి.
Similar News
News October 19, 2025
సోయాచిక్కుడులో కాయకుళ్లు.. నివారణ ఇలా

ప్రస్తుతం సోయాచిక్కుడు గింజ గట్టిపడే దశలో ఉంది. అయితే వర్షాల కారణంగా ఆంత్రాక్నోస్ కాయకుళ్లు, మసిబొగ్గు తెగుళ్లు ఎక్కువగా పంటకు వ్యాపిస్తున్నాయి. దీంతో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. వీటి నివారణకు ముందస్తు చర్యగా 2.5గ్రా. టెబ్యుకొనజోల్ 10శాతం+ సల్ఫర్ 65 శాతం WG లేదా 0.6 మి.లీ పైరాక్లోస్ట్రోబిన్+ప్లక్సాపైరోక్సాడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 2.0గ్రా. మేథిరం+ పైరాక్లోస్ట్రోబిన్ కూడా వాడొచ్చు.
News October 19, 2025
టెన్త్, ఇంటర్ అర్హతతో 1426 పోస్టులు!

టెరిటోరియల్ ఆర్మీ 1426 సోల్జర్ పోస్టులను భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ ర్యాలీ చేపట్టనుంది. టెన్త్, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 1వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, PFT, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.ncs.gov.in/
News October 19, 2025
మళ్లీ పంచాయతీ రాజ్ చట్ట సవరణ!

TG: స్థానిక ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నా పోటీ చేసేందుకు అర్హులని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం పంచాయతీ రాజ్ చట్టం-2018, 21(ఏ)ను సవరణ చేయాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఆ శాఖను ఆదేశించింది. ఈ బిల్లును గవర్నర్ ఆమోదిస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో అమల్లోకి వస్తుంది. గతంలో గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం, స్థానిక ఎన్నికలకు చేసిన రిజర్వేషన్లు తదితరాల కోసం చట్టాన్ని సవరించారు.