News February 14, 2025
TGSRTCకి రూ.21.72 కోట్ల టోకరా.. ‘గో రూరల్’ ఆస్తులు సీజ్

TGSRTC బస్సులపై ప్రకటనల పేరుతో గో రూరల్ ఇండియా రూ.21.72 కోట్ల మోసానికి పాల్పడింది. యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వకుండా తమ అనుబంధ కంపెనీలకు మళ్లించుకుని వ్యాపారం చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.6.47 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.
Similar News
News November 19, 2025
పెరవలి: కూతురిని గర్భిణిని చేసిన తండ్రి..డీఎస్పీ విచారణ

పెరవలి మండలంలో కన్న కూతురిపై తండ్రి రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడి గర్భిణిని చేసిన విషయం తెలిసిందే. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ జి.దేవకుమార్ గ్రామంలో విచారణ చేపట్టారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు.
News November 19, 2025
HYD: వరుసగా ముహుర్తాలు.. మాల్స్ ఫుల్

ఈ నెలలో వచ్చే వారంలో భారీగా ముహూర్తాలు ఉండడంతో బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, కొంపల్లి, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్ నిండుగా కనిపిస్తున్నాయి. మాల్స్ వద్ద వస్త్రాల కొనుగోలు జరుగుతుండగా, బంగారు దుకాణాల్లో సైతం జనం పెరుగుతున్నారు. 3 రోజులుగా డిమాండ్ మరింత పెరిగిందని షాపుల యజమానులు చెబుతున్నారు.
News November 19, 2025
HYD: సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టు సీరియస్

సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై సంధ్య శ్రీధర్రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం హైడ్రా తీరుపై సీరియస్ అయింది. కూల్చివేతలకు అనుమతి ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. ‘కోర్టు ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదు’ అని హైడ్రాను నిలదీసింది. ఈ కేసు తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.


