News March 25, 2025

ఉప్పల్ స్టేడియంలో తమన్ మ్యూజికల్ ఈవెంట్

image

ఎల్లుండి ఉప్పల్‌లో లక్నోతో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ప్రత్యక్షంగా హాజరయ్యే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ప్రారంభానికి ముందు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సంగీత కార్యక్రమంతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఐపీఎల్ అధికారిక హ్యాండిల్ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఐపీఎల్ జరుగుతున్న పలు స్టేడియాల్లో మ్యాచ్‌కు ఇదే తరహాలో మ్యూజికల్ ఈవెంట్స్‌ను బీసీసీఐ నిర్వహిస్తోంది.

Similar News

News January 9, 2026

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

image

ట్రంప్ సుంకాల వార్నింగ్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై ఇవాళ కూడా కనిపిస్తోంది. సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 66,907 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 25,861 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ICICI బ్యాంక్, అదానీ పోర్ట్స్, NTPC, ట్రెంట్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, HDFC, హిందుస్తాన్ యునిలీవర్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియడంతో రూ.7.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.

News January 9, 2026

అబార్షన్‌కు భర్త అనుమతి అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

image

ప్రెగ్నెన్సీని కొనసాగించాలని మహిళను బలవంతం చేయడం ఆమె శరీరంపై దాడేనని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల ఆమె మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిపింది. తన మాట వినకుండా భార్య 14 వారాల ప్రెగ్నెన్సీని తొలగించుకుందని భర్త(ప్రస్తుతం విడిగా ఉంటున్నారు) పెట్టిన క్రిమినల్ కేసును కొట్టేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం గర్భస్రావానికి భర్త అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.

News January 9, 2026

ముందు తూటాలు.. తర్వాతే మాటలు: USకు డెన్మార్క్ వార్నింగ్

image

గ్రీన్‌లాండ్ విషయంలో USకు డెన్మార్క్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ అమెరికా బలవంతంగా గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించాలని చూస్తే ఆదేశాల కోసం చూడకుండానే కాల్పులు జరపాలని తమ సైన్యానికి స్పష్టం చేసింది. ‘ముందు కాల్పులు జరపండి.. ప్రశ్నలు తర్వాత అడగండి’ అనే నిబంధన అమల్లో ఉందని డెన్మార్క్ రక్షణ శాఖ ప్రకటించింది. ఇది కేవలం గ్రీన్‌లాండ్ సమస్యే కాదని, నాటో కూటమి మనుగడకే ప్రమాదమని డెన్మార్క్ హెచ్చరించింది.