News September 24, 2024

థాంక్యూ సీఎం రేవంత్ గారు: ఎన్టీఆర్

image

‘దేవర’ టికెట్ ధర పెంపునకు అనుమతిస్తూ జీఓ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘మా సినిమా కోసం జీఓ జారీ చేసిన గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు సినీ పరిశ్రమకు మీరు అందిస్తున్న ఎనలేని మద్దతుకు కృతజ్ఞులం’ అని ట్వీట్ చేశారు. ఈ నెల 27న దేవర మూవీ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Similar News

News September 24, 2024

బెంగళూరు ఖాళీ అవుతుంది: ఇన్‌ఫ్లుయెన్సర్ వ్యాఖ్యలపై దుమారం

image

ఉత్త‌ర భార‌త ప్ర‌జ‌లు బెంగ‌ళూరును వీడితే న‌గ‌రం మొత్తం ఖాళీ అవుతుంద‌ని, ఇక్క‌డ డ‌బ్బు కొర‌త ఏర్ప‌డుతుందని ఒక ఇన్‌ఫ్లుయెన్స‌ర్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. ‘క‌న్న‌డిగులు త‌ర‌చూ మ‌మ్మ‌ల్ని ఇక్కడి నుంచి వెళ్లిపోమంటూ హేళన చేస్తుంటారు. మేము నిజంగానే వెళ్లిపోతే మీ న‌గ‌రం ఖాళీ అయిపోతుంది’ అంటూ సుగంధ్ శర్మ వ్యాఖ్యానించారు. కొంత మంది ఆమెపై భగ్గుమంటున్నారు. నగరం విడిచి వెళ్లాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

News September 24, 2024

పంటలకు తెగుళ్లు.. రైతులకు సూచనలు ఇవ్వాలని మంత్రి ఆదేశాలు

image

TG: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలకు తెగుళ్ల బెడద పెరిగి రైతులు అల్లాడిపోతున్నారు. వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు, పత్తిలో రసం పీల్చే పురుగుల, మెగ్నీషియం లోపం ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలతో కలిసి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. తెగుళ్ల నివారణ కోసం రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పారు.

News September 24, 2024

అమరావతిలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల పర్యటన

image

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.15వేల కోట్ల మేర రుణం అందిస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు మరోసారి అమరావతిలో పర్యటించారు. లింగాయపాలెం గ్రామస్థులతో భేటీ అయ్యారు. భూసమీకరణ, రైతు కూలీల జీవన ప్రమాణాలు, వారి స్థితిగతులపై చర్చించారు. అనంతరం వీఐటీ వర్సిటీలో యాజమాన్య ప్రతినిధులతో సమావేశమయ్యారు.