News March 19, 2024
మీరు చూపిన ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలు: తమిళి సై

తెలంగాణ, పుదుచ్చేరి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలకు మాజీ గవర్నర్ తమిళి సై కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలంగాణ & పుదుచ్చేరికి చెందిన సోదర, సోదరీమణులు, తల్లులు, పెద్దలు నాపై చూపిన ప్రేమ, ఆప్యాయతకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని ఆమె ట్వీట్ చేశారు. తమిళి సై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 12, 2025
‘కిష్కింధపురి’ పబ్లిక్ టాక్

కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ సినిమా ప్రీమియర్లు పడ్డాయి. మూవీ చూసిన వాళ్లు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. హీరోహీరోయిన్ల యాక్టింగ్, విజువల్స్ బాగున్నాయని అంటున్నారు. స్క్రీన్ ప్లే, సెకండాఫ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సిందని చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ&రేటింగ్.
News September 12, 2025
ఎయిర్‌టెల్ డౌన్.. కస్టమర్ల ఫైర్

ఎయిర్‌టెల్ కస్టమర్లు నెట్‌వర్క్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 రోజులుగా సరిగా సిగ్నల్స్ రావడం లేదని వాపోతున్నారు. మొబైల్ నెట్‌వర్క్‌తో పాటు ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ నెట్ కూడా పనిచేయడం లేదంటున్నారు. కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. SMలో తమ అసంతృప్తిని తెలియజేస్తూ ‘#AirtelDown, #BanAirtel’ హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. మీకూ నెట్‌వర్క్ సమస్య ఎదురవుతోందా?
News September 12, 2025
బజరంగ్ పునియా తండ్రి కన్నుమూత

భారత రెజ్లర్, ఒలింపిక్ మెడల్ విజేత బజరంగ్ పునియా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి బల్వాన్ పునియా ఊపిరితిత్తుల సమస్యతో కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో గత 18 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తమను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు తన తండ్రి చాలా కష్టపడ్డారని, కుటుంబానికి ఆయనే వెన్నెముక అని బజరంగ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.