News November 1, 2024

మీ ప్రేమకు ధన్యుడను: కిరణ్ అబ్బవరం

image

నిన్న రిలీజైన ‘క’ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు. ‘సినిమాల్లో ఎవరికైనా విజయం వస్తే హిట్ కొట్టాడు అంటారు. నాకు హిట్ వస్తే హిట్ కొట్టేశామ్ అంటున్నారు. సక్సెస్ కంటే మీరు నాపైన చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతను మాటల్లో చెప్పలేను. ఇందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 17, 2025

టీనేజర్ల కోసం ChatGPTలో సెక్యూరిటీ ఫీచర్లు!

image

టీనేజర్ల భద్రత, ప్రైవసీ కోసం ChatGPTలో అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొస్తున్నట్లు OpenAI ప్రకటించింది. యూజర్లను వయసు ఆధారంగా 2 కేటగిరీలుగా (13-17, 18+) గుర్తించేందుకు age ప్రిడిక్షన్ సిస్టమ్‌ను తీసుకురానుంది. యూజర్ ఇంటరాక్షన్‌ను బట్టి వయసును అంచనా వేయనుంది. కొన్నిసార్లు ఏజ్ వెరిఫై కోసం ID కూడా అడుగుతుందని సంస్థ తెలిపింది. సూసైడ్ వంటి సెన్సిటివ్ అంశాలపై AI స్పందించదని వివరించింది.

News September 17, 2025

ఆసియా కప్: గంట సమయం కోరిన పాక్!

image

అవసరమైతే ఆసియా కప్‌ను బహిష్కరిస్తామన్న పాక్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. మ్యాచ్ ప్రారంభ సమయాన్ని గంట పొడిగించాలని పీసీబీ కోరినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దీంతో ఇంకా హోటల్ నుంచి బయల్దేరని ఆటగాళ్లు చేరుకునేందుకే అడిగి ఉండొచ్చని సమాచారం. కాగా భారత్‌తో హ్యాండ్ షేక్ వివాదంతో మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని, లేదంటే మిగతా మ్యాచులు ఆడమని PCB ప్రకటించింది. కానీ ఈ డిమాండ్‌ను ICC తిరస్కరించింది.

News September 17, 2025

IFSCAలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

image

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(<>IFSCA<<>>) 20 ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 25వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫేజ్1, ఫేజ్ 2 రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫేజ్1 పరీక్ష అక్టోబర్ 11న, ఫేజ్ 2 పరీక్ష నవంబర్ 15న నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://ifsca.gov.in/Career