News October 17, 2024
థాంక్యూ పవన్ కళ్యాణ్: పన్నీర్ సెల్వం

AIADMK వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ వరస ట్వీట్లలో ఆ పార్టీకి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ విషెస్‌పై ఆ పార్టీ కో-ఆర్డినేటర్ పన్నీర్ సెల్వం స్పందించారు. ‘డియర్ పవన్ కళ్యాణ్, AIADMK 53వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మీరు విష్ చేసినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. సనాతన ధర్మం విషయంలో డీఎంకేతో విభేదాల నేపథ్యంలో పవన్ AIADMKకి విషెస్ చెప్పడం ఆసక్తికరం.
Similar News
News December 8, 2025
‘హమాస్’పై ఇండియాకు ఇజ్రాయెల్ కీలక విజ్ఞప్తి

‘హమాస్’ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్‌ను ఇజ్రాయెల్ కోరింది. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, ఇరాన్ సంస్థలతో దీనికి సంబంధాలున్నాయని చెప్పింది. గాజాలో కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా దాడులకు అంతర్జాతీయ సంస్థలను వాడుకుంటోందని తెలిపింది. హమాస్ వల్ల ఇండియా, ఇజ్రాయెల్‌కు ముప్పు అని పేర్కొంది. ఇప్పటికే US, బ్రిటన్, కెనడా తదితర దేశాలు హమాస్‌ను టెర్రర్ సంస్థగా ప్రకటించాయి.
News December 8, 2025
తెలంగాణ అప్డేట్స్

* ఈ నెల 17 నుంచి 22 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది
* తొలిసారిగా SC గురుకులాల్లో మెకనైజ్డ్ సెంట్రల్ కిచెన్‌ను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
* రాష్ట్రంలోని హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, CHCల్లో మరో 79 డయాలసిస్ సెంటర్లు..
* టెన్త్ పరీక్షలకు విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సేకరించాలని స్పష్టం చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి
News December 8, 2025
హోటళ్లలో ఇకపై ఆధార్ కాపీ అవసరం లేదు!

వెరిఫికేషన్ పేరుతో హోటళ్లు, ఈవెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆధార్ కాపీలను తీసుకోకుండా UIDAI కొత్త రూల్ తీసుకురానుంది. QR కోడ్ స్కానింగ్ లేదా ఆధార్ యాప్ ద్వారా వెరిఫై చేసేలా మార్పులు చేయనుంది. ఆధార్ వెరిఫికేషన్ కోరే హోటళ్ల రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేసింది. యూజర్ల ప్రైవసీకి, డేటాకు రక్షణ కల్పించేందుకు UIDAI ఈ దిశగా అడుగులేస్తోంది. దీంతో ఓయో, ఇతర హోటళ్లలో గదులు బుక్ చేసుకునే వారికి ఉపశమనం కలగనుంది.


