News January 13, 2025

Thank You పవన్ కళ్యాణ్: YCP

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వైసీపీ థాంక్స్ చెప్పింది. జగన్ హయాంలో చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేస్తూ ఆయన తమకు స్టార్ క్యాంపెయినర్‌గా మారారని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. స్కూళ్లు, కర్నూలులో గ్రీన్‌కో సోలార్ ప్రాజెక్టు, పంప్ స్టోరేజ్, విశాఖలో రుషికొండ భవనాల వద్ద ఆయన ఫొటోలను షేర్ చేసింది. కాగా తమ ప్రభుత్వంలో పూర్తిచేసిన కార్యక్రమాలపై వైసీపీ ఇవాళ్టి నుంచి క్యాంపెయిన్ ప్రారంభించింది.

Similar News

News January 13, 2025

GOOD NEWS: పీఎం కిసాన్ రూ.10,000లకు పెంపు?

image

పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు కేంద్రం ఏటా రూ.6,000 ఇస్తుండగా రూ.10,000లకు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని సమాచారం. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ పెంపుపై మాట్లాడిన విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చే రూ.10వేలతో పాటు తాము మరో రూ.10వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని చెప్పారు.

News January 13, 2025

పసుపు బోర్డుతో ఉపయోగాలివే

image

కొత్త వంగడాల అభివృద్ధి నుంచి హార్వెస్ట్ మేనేజ్‌మెంట్, మార్కెట్ వరకు రైతులకు లబ్ధి కలుగుతుంది. పసుపు తవ్వకం, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, డ్రై చేయడానికి అవసరమైన యంత్రాలను ప్రభుత్వం రాయితీపై అందిస్తుంది. పంట నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సహకారం ఉంటుంది. తెలంగాణవ్యాప్తంగా ప్రతి సీజన్‌లో దాదాపు 9 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుంది. కాగా రేపు నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు <<15148521>>ప్రారంభోత్సవం<<>> జరగనుంది.

News January 13, 2025

కౌశిక్ అరెస్ట్.. కరీంనగర్‌కు బీఆర్ఎస్ లీగల్ టీమ్

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు 132, 115(2), 352, 292 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. కరీంనగర్‌కు తరలిస్తున్న ఆయనను జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు కౌశిక్ అరెస్ట్ విషయం తెలియగానే బీఆర్ఎస్ లీగల్ టీమ్‌ కూడా కరీంనగర్ బయల్దేరింది.