News December 1, 2024
థాంక్యూ.. రణ్వీర్ సింగ్: తేజ సజ్జా
హనుమాన్ మూవీకి తాను జీవితంలో మరచిపోలేని కాంప్లిమెంట్ను రణ్వీర్ సింగ్ ఇచ్చారని ఆ సినిమా హీరో తేజ సజ్జా తెలిపారు. ‘సినిమాలో నా ప్రదర్శనతో పాటు చాలా చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా ఆయన గుర్తుపెట్టుకుని మరీ చెప్పడం నాకు ఆశ్చర్యం అనిపించింది. అది కేవలం కాంప్లిమెంట్ కాదు. నాకు దక్కిన ప్రోత్సాహం. రణ్వీర్ చాలా స్వచ్ఛమైన మనిషి. నా ప్రయాణాన్ని మరింత స్పెషల్ చేసినందుకు థాంక్యూ భాయ్’ అని పేర్కొన్నారు.
Similar News
News December 1, 2024
కేజీబీవీల్లో డైట్ ఛార్జీల పెంపు
AP: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో డైట్ ఛార్జీలను పెంచుతూ సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి రూ.1400 ఇస్తుండగా, రూ.1600కు పెంచినట్లు తెలిపారు. ఈ ఛార్జీలతో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నారు. తాజా నిర్ణయంతో 1.1లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
News December 1, 2024
రైతుభరోసాపై క్లారిటీ ఇవ్వని సీఎం!
TG: నిన్న పాలమూరులో జరిగిన రైతు సదస్సులో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. సన్నరకం వరికి బోనస్ ఇస్తుండటంతో రైతు భరోసా నిధులను పక్కనబెట్టేసినట్లేనని ప్రచారం జరుగుతోంది. సీఎం దీనిపై ప్రకటన చేస్తే క్లారిటీ వచ్చేది. కానీ అలాంటిదేమీ జరగలేదు. మరోవైపు రైతులు బోనస్కే ప్రాధాన్యత ఇస్తున్నారని అంతకుముందు మంత్రి తుమ్మల వ్యాఖ్యానించడంతో రైతుభరోసాపై అయోమయం నెలకొంది.
News December 1, 2024
ఇవాళ, రేపు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఆకస్మిక వరదలు!
AP: ఫెంగల్ తుఫాన్ తీరం దాటడంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. గంటకు 90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.