News October 4, 2025
థాంక్యూ రోహిత్.. అభిమానుల ట్వీట్స్

వన్డే క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా విశేష సేవలందించిన రోహిత్ శర్మ భారత జట్టును అగ్రస్థానంలో నిలిపారు. అయితే కొత్త కెప్టెన్‌గా గిల్‌ను ఎంపిక చేయడంతో రోహిత్ సేవలను గుర్తుచేస్తూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ‘2023 వరల్డ్ కప్‌లో 11 మ్యాచుల్లో ఇండియా పది గెలిచింది. టీ20 WC, CTని గెలవడంలో హిట్‌మ్యాన్ పాత్ర కీలకం. 8 నెలల్లో 2 ICC ట్రోఫీలు వచ్చేలా చేశారు. థాంక్యూ రోహిత్’ అని పోస్టులు చేస్తున్నారు.
Similar News
News October 4, 2025
భారత్ నా మాతృభూమి: పాక్ మాజీ క్రికెటర్

తాను భారత సిటిజన్‌షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలను పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఖండించారు. పాక్ ప్రభుత్వం, PCB తనపై ఎంత వివక్ష చూపినా ఇక్కడి ప్రజలు మాత్రం ఎంతో ప్రేమించారని చెప్పుకొచ్చారు. పాక్ తన జన్మభూమి అయితే, భారత్ మాతృభూమి అని ట్వీట్ చేశారు. ఇండియా ఒక దేవాలయమని అభివర్ణించారు. భవిష్యత్తులో ఆ దేశ సిటిజన్‌షిప్ కావాలనుకుంటే అందుకోసం CAA అమల్లో ఉందని గుర్తు చేశారు.
News October 4, 2025
Inspiration: చెట్టు నేర్పే జీవిత పాఠమిదే!

ప్రపంచంలో ప్రతి వస్తువు, జీవి మనకు పాఠాలను నేర్పిస్తూనే ఉంటాయి. చెట్టు కూడా లక్ష్యాలను చేరుకోవడానికి కొన్ని పాఠాలు నేర్పిస్తోంది. సన్‌లైట్ కోసం మొక్క వంగినట్టుగా ఎదగడానికి అవకాశాలున్నప్పుడు దారి మార్చుకోవడానికైనా వెనకాడొద్దు. వేర్లలా కలిసిమెలిసి ఉండటం అలవరుచుకోవాలి. ఆకులు రాల్చినట్లుగా అనవసర విషయాలను వదిలేయాలి. ఎప్పుడో కాసే పండ్ల కోసం చెట్టు ఎదిగినట్లుగా మనమూ లక్ష్యం కోసం కష్టపడుతూనే ఉండాలి.
News October 4, 2025
7న పార్టీ కీలక నేతలతో జగన్ సమావేశం

AP: YCP చీఫ్ జగన్ ఈనెల 7న తాడేపల్లిలో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో భేటీ అవుతారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది. 8న భీమవరంలో EX MLA ప్రసాదరాజు కుమారుడి పెళ్లికి హాజరవుతారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు అడ్డుకొనేందుకు 9వ తేదీన మాకవరపాలెం(M) భీమబోయినపాలేనికి వెళ్తారని పార్టీ పేర్కొంది. అక్కడ నిలిచిపోయిన వైద్య కళాశాలను సందర్శిస్తారు.