News October 22, 2025
మీ విషెస్‌కు థాంక్స్ ట్రంప్: మోదీ

దీపావళి సందర్భంగా విష్ చేసిన US అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘మీ ఫోన్ కాల్‌కు థాంక్స్. ఈ పండుగ నాడు మన రెండు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచాన్ని ప్రకాశింపజేయడాన్ని కొనసాగించాలి. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి’ అని పేర్కొన్నారు. కాగా 2 దేశాల మధ్య వాణిజ్యం గురించి <<18068579>>మోదీతో మాట్లాడినట్లు<<>> ట్రంప్ తెలిపారు. వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
Similar News
News October 22, 2025
పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలు

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.
News October 22, 2025
అందుకే అలా మాట్లాడా: నిర్మాత రాజేశ్

నిన్న ఓ వెబ్‌సైట్‌పై <<18065234>>ఫైరయిన<<>> ‘K RAMP’ నిర్మాత రాజేశ్ దండా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘రేటింగ్ ఇవ్వడంపై అభ్యంతరం లేదు. కానీ ఆదరణ పెరిగాక నెగటివ్ వార్తలు రాయడం బాధించింది. నేను వాడిన భాష అభ్యంతరకరం అంటున్నారు. రూ.కోట్లు ఖర్చుచేసిన నా సినిమాను చంపేసే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా. అందుకే అలా మాట్లాడా. సినీ జర్నలిస్టులంటే నాకు ఎప్పుడూ గౌరవమే’ అని ట్వీట్ చేశారు.
News October 22, 2025
కేటీఆర్, హరీశ్‌రావుతో కేసీఆర్ సమీక్ష

TG: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సమీక్షిస్తున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా వ్యూహం, ప్రచార సరళి గురించి ఆయనకు కేటీఆర్, హరీశ్‌రావు వివరిస్తున్నారు. రేపు జరగనున్న బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జుల సమావేశంపైనా చర్చిస్తున్నట్లు సమాచారం.