News November 12, 2024

థాంక్స్ శివయ్య.. భక్తి చాటిన వానరం

image

TG: ఓ వానరం శివలింగం వద్ద చేసిన సందడి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. కార్తీకమాసం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని శివలింగం వద్ద భక్తులు పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉంచిన ప్రసాదాలు, అరటిపండ్లను వానరాలు ఆరగించాయి. వాటిల్లో ఓ కోతి శివలింగంపై తలపెట్టి వేడుకున్నట్లు కనిపించింది. ఆహారం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పినట్లు ఆ దృశ్యం ఉందని అక్కడున్న వారు చర్చించుకున్నారు.

Similar News

News December 2, 2025

రూపాయి నేల చూపు.. మరింత కనిష్ఠ స్థాయికి!

image

రూపాయి నేలచూపులు చూస్తోంది. వరుసగా ఐదో సెషన్‌లోనూ క్షీణించి ఇవాళ రికార్డు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే 89.874 వద్ద ప్రస్తుతం ట్రేడవుతోంది. అంతకుముందు All time low 89.895ను తాకి 90కి చేరువైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 4 శాతం వరకు రూపాయి పడిపోయింది. అమెరికా డాలర్ బలపడటం, ఇండియా-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఆలస్యమవడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

పెళ్లికి వచ్చిన వారికి హెల్మెట్లు

image

రాజస్థాన్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఇచ్చిన రిటర్న్ గిఫ్టులు SMలో వైరల్ అయ్యాయి. అక్కడి కుచామన్ నగరంలో మనోజ్ బర్వాల్ అనే వ్యక్తి తన కూతురు సోనును యశ్ బెద్వాల్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహానికి హాజరైన వారికి రిటర్న్ గిఫ్టులుగా హెల్మెట్లు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ 286 హెల్మెట్లను అందజేయడం పట్ల SMలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.