News September 10, 2024
మలయాళ సినిమాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు థాంక్స్

అల్లు అర్జున్‌కు కేరళలోనూ భారీగా అభిమానులున్న విషయం తెలిసిందే. అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్లూ ఉన్నాయి. ఇటీవల మాలీవుడ్‌లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ ‘తలవన్’ మూవీ ఎండ్‌కార్డులో ‘ఆల్ కేరళ అల్లు అర్జున్ ఫ్యాన్స్& వెల్ఫేర్ అసోసియేషన్’కు మేకర్స్ థాంక్స్ చెప్పారు. హీరోకు ధన్యవాదాలు చెప్పడం కామన్ అని, అభిమానులకూ చెప్పడం bhAAi రేంజ్‌కు నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News March 26, 2026
మార్కాపురం ప్రమాదంపై జగన్, పవన్ దిగ్భ్రాంతి

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని కోరారు. మార్కాపురం ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పవన్ కళ్యాణ్ చెప్పారు.
News March 26, 2026
RCBకి కొత్త ఓనర్లు.. విజయ్ మాల్యా అభినందనలు

RCB కొత్త యజమానులకు ఒకప్పటి ఓనర్, వ్యాపారవేత్త విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు. 2008లో ₹450కోట్లు పెట్టి ఈ ఫ్రాంచైజీ కొన్నప్పుడు అందరూ నవ్వుకున్నారని.. కానీ అదే ₹16,500Cr విలువైన బ్రాండ్‌గా ఎదిగినందుకు సంతోషంగా ఉందన్నారు. RCB ఎప్పటికీ తన డీఎన్ఏలో భాగమని.. యువ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం చెరగని జ్ఞాపకమని అన్నారు. తన హయాంలో, ఆ తర్వాతా RCBకి మద్దతు ఇచ్చిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.
News March 26, 2026
‘హంద్రీ-నీవా’ రెండో దశకు గ్రీన్ సిగ్నల్

AP: హంద్రీ-నీవా సుజల స్రవంతి(HNSS) రెండో దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల్లో నాబార్డు/రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.1,184 కోట్లతో పనులు చేపట్టాలని సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. ఈ నిధులతో సిమెంట్ కాంక్రీట్ లైనింగ్, కాల్వల విస్తరణ, ప్రధాన కాల్వల పునరుద్ధరణ, ఆధునికీకరణ, ఇతర నిర్మాణ పనులు చేపట్టనున్నారు.


