News April 9, 2024

చంద్రబాబు, పవన్, మోదీలకు థ్యాంక్స్: YCP

image

ప్రభుత్వంలోకి రాగానే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని TDP చీఫ్ చంద్రబాబు ప్రకటించడంపై YCP స్పందించింది. ‘వాలంటీర్ వ్యవస్థ శక్తిని గుర్తించినందుకు చంద్రబాబు, మోదీ, పవన్‌లకు థ్యాంక్స్. ఇది జగనన్న పాలనా విజయానికి నిదర్శనం. అందుకే విపక్షాలు కూడా ఆదరించి, పాటించాలనుకునేలా చేసింది. మీరేం చింతించకండి, జూన్ 4న జగన్ CMగా ప్రమాణం చేయగానే వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తాం’ అని ట్వీట్ చేసింది.

Similar News

News January 3, 2025

తొలి రోజు ముగిసిన ఆట.. బుమ్రాకు వికెట్

image

సిడ్నీ టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్సులో భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 9 పరుగులకే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఖవాజా(2)ను తాత్కాలిక కెప్టెన్ బుమ్రా ఔట్ చేశారు. ఆసీస్ ఇంకా 176 పరుగులు వెనకబడి ఉంది. కాగా తొలి రోజు ఆట 75.2 ఓవర్లే సాధ్యపడింది.

News January 3, 2025

స్కూలు విద్యార్థులకు ఇన్ఫోసిస్ స్కిల్స్

image

AP: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి టెక్నాలజీ రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై స్కూలు దశలోనే విద్యార్థుల్లో అవగాహన కల్పించేలా ఇన్ఫోసిస్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇన్ఫోసిస్ రూపొందించిన బస్సును మంత్రి లోకేశ్ ప్రారంభించారు. స్కూలు విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్, IOT, AI రంగాలపై ఇందులోని ట్రైనర్స్ బేసిక్ స్కిల్స్ అందిస్తారు.

News January 3, 2025

గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తెలంగాణను మారుస్తాం: భట్టి

image

TG: రాష్ట్రంలో 2030 నాటికి రెండు వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆస్ట్రేలియా-ఇండియా మినరల్స్ హబ్ వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్‌ హబ్‌గా మారుస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఫ్లోటింగ్ సోలార్‌పై పెట్టుబడులు పెడతామని భట్టి చెప్పారు. మరోవైపు దేశ ప్రగతిలో ఐఐటీలది కీలక పాత్ర అని తెలిపారు.