News August 11, 2024

భారత్‌కు థాంక్స్: హసీనా కుమారుడు

image

తన తల్లిని కాపాడినందుకు షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వజీద్ జాయ్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం బంగ్లాలో మూకస్వామ్యం కొనసాగుతోందన్నారు. చీఫ్ జస్టిస్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్, పోలీసు చీఫ్ సహా ఉన్నతాధికారులను తొలగిస్తున్నారని చెప్పారు. ఇవే మూకలు రేపు తమకు నచ్చిన వ్యక్తుల్ని తాత్కాలిక ప్రభుత్వంలో నియమించాలని డిమాండ్ చేస్తాయన్నారు. హసీనా బంగ్లాకు వెళ్లాలని భావిస్తున్నట్టు వివరించారు.

Similar News

News November 25, 2025

జుబీన్ గార్గ్‌ను హత్య చేశారు: సీఎం హిమంత

image

ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం CM హిమంత బిశ్వశర్మ సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రమాదవశాత్తు చనిపోలేదని, హత్యకు గురయ్యారని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. 52 ఏళ్ల జుబీన్ ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తు మరణించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై తొలి నుంచీ ఆయన కుటుంబం అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. ఈక్రమంలోనే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News November 25, 2025

బలవంతపు వాంతులతో క్యాన్సర్‌: వైద్యులు

image

బ్రష్ చేశాక చాలా మంది గొంతులోకి వేళ్లు పెట్టి బలవంతంగా వాంతులు చేసుకుంటారు. అలా పదే పదే చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కడుపులోని యాసిడ్ పదేపదే పైకి తన్నడం వల్ల అన్నవాహికలోని ‘టైల్స్’ లాంటి సున్నితమైన కణాలు అరిగిపోతాయి. ఇలా మాటిమాటికీ జరిగితే తీవ్రమైన సందర్భాల్లో క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంటుంది. నాలుకను గీసుకొని ముఖం కడుక్కుంటే చాలు’ అని సూచించారు.

News November 25, 2025

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

image

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని, రాబోయే 24 గంటల్లో ఇది బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మరోవైపు మలక్కా జలసంధి వద్ద కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని పేర్కొంది. వీటి ప్రభావంతో NOV 29 నుంచి DEC 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.