News July 5, 2024

ముంబై పోలీసులకు థాంక్స్: కోహ్లీ

image

ముంబైలో టీమ్ ఇండియా విజయోత్సవ యాత్రకు అభిమానులు అసంఖ్యాకంగా వచ్చారు. ఆ పరిస్థితిని ముంబై పోలీసులు సమర్థంగా ఎదుర్కొని శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూశారు. ఈ నేపథ్యంలో వారికి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కృతజ్ఞతలు తెలిపారు. ‘టీం ఇండియా విక్టరీ పరేడ్‌లో తిరుగులేని సమర్థత చూపించిన ముంబై పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ నిబద్ధత, సేవ అద్భుతం. జైహింద్’ అని ట్వీట్ చేశారు.

Similar News

News July 8, 2024

శాంసంగ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్ట్రైక్

image

సౌత్ కొరియాలోని శాంసంగ్ ఉద్యోగులు జీతాలు పెంచాలని ఆ కంపెనీ చరిత్రలోనే అతి పెద్ద స్ట్రైక్‌కు తెరతీశారు. యాజమాన్యంతో చర్చలు విఫలమవడంతో దాదాపు 6,500 మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి 3 రోజుల సమ్మెకు దిగారు. కంపెనీకి వచ్చే అదనపు లాభాల్లో నుంచి తమకు రావాల్సిన బోనస్‌, ఏడాదికి ఒకరోజు అదనపు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే స్ట్రైక్‌పై శాంసంగ్ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తోంది.

News July 8, 2024

టాలీవుడ్ వల్లే స్టార్‌నయ్యా: కమల్

image

తెలుగు సినీ ఇండస్ట్రీనే తనను స్టార్‌ని చేసిందని కమల్ హాసన్ అన్నారు. మరో చరిత్ర, సాగరసంగమం, స్వాతిముత్యం వంటి అద్భుత విజయాలు ఇక్కడే దక్కాయని గుర్తు చేసుకున్నారు. 1996లో ‘భారతీయుడు’కు వసూళ్లు వస్తాయా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయని, అయితే ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చిందన్నారు. శంకర్ డైరెక్షన్‌లో ఆయన నటించిన ‘భారతీయుడు2’ ఈ నెల 12న రిలీజ్ కానుండగా HYDలో జరిగిన ప్రిరిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు.

News July 8, 2024

50 రోజుల సెలవుల తర్వాత తెరుచుకున్న సుప్రీంకోర్టు

image

నెలన్నర వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు ఆరంభమైంది. సెలవుల కారణంగా మే 20న కోర్టు మూతపడగా నేడు తెరుచుకుంది. దీంతో లాయర్లు న్యాయస్థానం లోపలికి వెళ్లేందుకు క్యూ కట్టారు. కేజ్రీవాల్ అరెస్టు చట్టబద్ధత, పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా, పతంజలి లాంటి ముఖ్యమైన కేసులపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగాల్సి ఉంది.