News January 8, 2025

ప్రధానికి కృతజ్ఞతలు: శర్మిష్ట ముఖర్జీ

image

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్మారకచిహ్నం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడంపై ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి తన కృతజ్ఞతల్ని తెలియజేశానని ఆమె ట్విటర్లో తెలిపారు. ‘నా మనస్ఫూర్తిగా పీఎంకు ధన్యవాదాలు. మేం అడగకపోయినా ప్రభుత్వం ఈ గౌరవం ఇవ్వడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఏ మాత్రం ఊహించలేదు’ అని పేర్కొన్నారు.

Similar News

News August 27, 2025

ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌కు క్యాన్సర్

image

తాను చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘ప్రస్తుతం నేను స్కిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్నా. ట్రీట్‌మెంట్‌లో భాగంగా వైద్యులు నా ముక్కు వద్ద కొంత చర్మాన్ని కట్ చేశారు. చికిత్స కంటే నివారణ మేలు. కానీ నా విషయంలో రెగ్యులర్ చెకప్స్ కీలకం’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. కాగా క్లార్క్‌కు క్యాన్సర్ ఉన్నట్లు 2006లోనే వైద్యులు నిర్ధారించారు.

News August 27, 2025

రష్యాతో ఎనర్జీ డీల్స్‌పై చర్చించిన US?

image

ఉక్రెయిన్‌ శాంతి చర్చల కోసం ఈనెల 16న పుతిన్, ట్రంప్ సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య ఎనర్జీ డీల్స్‌పై చర్చ జరిగినట్లు Reuters తాజాగా వెల్లడించింది. యుద్ధం ఆపేందుకు ఆంక్షలు ఎత్తివేస్తామని, పెట్టుబడులకు అనుమతిస్తామని రష్యాకు US ఆఫరిచ్చినట్లు పేర్కొంది. త్వరలో US టాప్ ఆయిల్ కంపెనీ Exxon Mobil రష్యాలో రీఎంట్రీ ఇవ్వొచ్చంది. ఇరు దేశాలు ట్రేడింగ్ కూడా రీస్టార్ట్ చేయొచ్చని తెలిపింది.

News August 27, 2025

TCS కొత్త ఆఫీస్ అద్దె రూ.2,130 కోట్లు

image

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) బెంగళూరులో కొత్త క్యాంపస్ ప్రారంభించనుంది. ఇందుకు బెంగళూరులోని 360 బిజినెస్ పార్క్ టవర్స్ యాజమాన్యంతో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. 14 లక్షల చదరపు అడుగుల కార్యాలయానికి 15 ఏళ్లకుగానూ రూ.2,130 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. నెలకు రూ.9.31 కోట్ల అద్దెతో రూ.112 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేసింది. ప్రతి మూడేళ్లకూ 12 శాతం అద్దె పెంపు ఉండనుంది.