News September 26, 2024
ఆ నటి వద్దన్నా నా దగ్గరకు వచ్చేది: యువీ

అప్పట్లో ఓ నటితో తాను డేటింగ్ చేసినట్లు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపారు. ‘2007-08లో బీజీటీ కోసం అడిలైడ్‌లో ఉన్నా. ఆ నటి కూడా షూటింగ్ కోసం అక్కడకు వచ్చారు. కొన్నాళ్లు నన్ను కలవొద్దని చెప్పా. ఆ తర్వాత బస్సులో కాన్‌బెర్రాకు నాతోనే వచ్చారు. ఆ రెండు టెస్టుల్లో నేను సరైన ప్రదర్శన చేయలేకపోయా. దీంతో నన్ను వదిలేయాలని ఆమెను వేడుకున్నా’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 23, 2025
నాగచైతన్య కొత్త మూవీ టైటిల్ వచ్చేసింది

అక్కినేని నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రివీల్ చేశారు. ‘వృషకర్మ’ టైటిల్‌తో నాగచైతన్య యాంగ్రీ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను Xలో పోస్ట్ చేశారు. చైతూకి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ సాలిడ్‌గా ఉందని మహేశ్ పేర్కొన్నారు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్గా నటిస్తున్నారు.
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>


