News June 24, 2024
ఆ ప్రచారం అవాస్తవం: హిరాణీ సన్నిహితులు

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించనున్న చిత్రంలో షారుఖ్ ఖాన్, సమంత నటించనున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రచారాన్ని డైరెక్టర్ రాజ్‌కుమార్ సన్నిహితులు కొట్టిపారేశారు. అసలు షారుఖ్, సమంతలతో ఇప్పటి వరకు చర్చలే జరపలేదని స్పష్టం చేశారు. ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదన్నారు. అలాగే దేశభక్తి, యాక్షన్ డ్రామా నేపథ్యంలో మూవీ ఉండనుందనే వార్తలనూ కొట్టిపారేశారు.
Similar News
News December 5, 2025
పుతిన్‌కు ‘బాడీ డబుల్స్’ ఉన్నారా?

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఆయన ‘బాడీ డబుల్స్’ గురించి చర్చ జరుగుతోంది. బహిరంగ కార్యక్రమాలు, ప్రయాణాలకు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తారని ఊహాగానాలు ఉన్నాయి. పుతిన్‌కు ముగ్గురు డూప్స్ ఉన్నారని ఉక్రెయిన్ గతంలో చెప్పింది. వారు ‘క్లోన్ ఆర్మీ’ అని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే అవన్నీ అవాస్తవాలని, ‘బాడీ డబుల్’ ప్రతిపాదనలను తాను తిరస్కరించానని గతంలో పుతిన్ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.
News December 5, 2025
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 5, 2025
నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్‌లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్‌లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.


