News August 25, 2024
ఆ వివాదం నన్ను భయపెట్టింది: రాహుల్

నాలుగేళ్ల క్రితం ‘కాఫీ విత్ కరణ్’ షో ఇంటర్వ్యూ వివాదం తనను ఎంతగానో భయపెట్టిందని భారత క్రికెటర్ KL రాహుల్ అన్నారు. ఆ ఇంటర్వ్యూతో తన జీవితం మారిపోయిందని ఓ పాడ్ కాస్ట్ షోలో చెప్పారు. మహిళపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని జట్టు నుంచి సస్పెన్షన్కు గురైనట్లు గుర్తుచేశారు. కాగా ఈ షోలో మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంతో వారిపై రూ.20 లక్షల చొప్పున ఫైన్తో పాటు కొంతకాలం సస్పెన్షన్ విధించింది.
Similar News
News September 15, 2025
గ్రామాల్లో మహిళా ఓటర్లే అత్యధికం: ఈసీ

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో గ్రామీణ జనాభా 1.95 కోట్లకు గానూ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు 5,763 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలను వెల్లడించింది. వీరిలో మహిళా ఓటర్లు 85,35,935 మంది కాగా పురుషులు 81,66,732 మంది ఉన్నారని తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకుపైగా ఎక్కువని పేర్కొంది.
News September 15, 2025
దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్

ఒడిశాలో ఓ హాస్టల్ విద్యార్థి చేసిన తుంటరి పని తోటి విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చింది. కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఓ స్టూడెంట్ ఫెవిక్విక్ వేశాడు. ఈ ఘటనతో వారి కళ్లు మూసుకుపోయాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకరికి కళ్లు పూర్తిగా తెరుచుకోగా మిగతావారికి అలాగే ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 15, 2025
CSIRలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

<