News May 21, 2024

ఆ హెలికాప్టర్ 45 ఏళ్ల నాటిది: నిపుణులు

image

ఇబ్రహీం రైసీ మరణంతో ఇరాన్ వాయు రవాణా భద్రతపై మళ్లీ చర్చ జరుగుతోంది. దౌత్య విబేధాలతో ఇరాన్‌కు ఏవియేషన్ పరికరాలు అమ్మడంపై USA ఆంక్షలు విధించింది. దీంతో ఆ దేశం తమ పాత చాపర్లలోని భాగాలు విడదీసి, కొన్ని సొంతంగా తయారుచేసుకుని వాడుతోంది. వీటి నాణ్యత అంతంతమాత్రమే. అధ్యక్షుడు రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ 1979కి ముందు కొన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది ఆ దేశ వాయు రవాణా ప్రమాణాలు, పరిస్థితులకు ఓ ఉదాహరణ.

Similar News

News November 12, 2025

రోహిత్ టార్గెట్.. ఫిట్‌నెస్, 2027 వరల్డ్ కప్!

image

2027 ODI వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోవాలని రోహిత్ శర్మ గట్టి పట్టుదలతో ఉన్నారు. డిసెంబర్ 24 నుంచి జరిగే విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడనున్నట్టు ప్రకటించడం అందుకేనని విశ్లేషకులు చెబుతున్నారు. వన్డే స్క్వాడ్‌లో చోటు దక్కాలంటే డొమెస్టిక్ క్రికెట్ తప్పక ఆడాల్సిందేనని BCCI రూల్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే బరువు తగ్గిన హిట్‌మ్యాన్.. ప్రపంచకప్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

News November 12, 2025

ఐరన్, క్యాల్షియం ట్యాబ్లెట్లు ఎలా తీసుకోవాలంటే?

image

హిమోగ్లోబిన్‌ తయారీలో ఐరన్‌, ఎముకలు బలంగా ఉండటానికి క్యాల్షియం అత్యవసరం. అందుకే గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, నెలసరి నిలిచిన మహిళలు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. అయితే ఈ రెండిటినీ ఒకేసారి తీసుకుంటే శరీరం ఐరన్‌ను గ్రహించుకోకుండా క్యాల్షియం అడ్డుపడుతుంది. ఐరన్‌ పరగడుపున బాగా ఒంట పడుతుంది కాబట్టి భోజనానికి ముందు తీసుకుంటే మంచిది. క్యాల్షియాన్ని భోజనంతో పాటు తీసుకోవచ్చు.

News November 12, 2025

వారితో మాకు సంబంధం లేదు: అల్ ఫలాహ్ యూనివర్సిటీ

image

ఢిల్లీ <<18265346>>ఎర్రకోట <<>>వద్ద పేలుడు కేసులో ప్రధాన నిందితులు అల్ ఫలాహ్ వర్సిటీ డాక్టర్లేనని అనుమానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని వర్సిటీ VC భూపిందర్ కౌర్ తెలిపారు. డాక్టర్లు ముజామిల్, షాహీన్‌తో తమకు సంబంధం లేదన్నారు. ‘మేం ఎలాంటి రసాయనాలు నిల్వ చేయట్లేదు. ఉపయోగించట్లేదు. స్టూడెంట్ల అకడమిక్, ట్రైనింగ్ కోసం అవసరమైనంత వాడుతున్నాం’ అని పేర్కొన్నారు.