News August 9, 2025

అది తప్పుడు ప్రచారం: చిరంజీవి

image

సినీ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై తాను హామీ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. ‘కార్మికులకు 30% వేతనం పెంపు తదితర డిమాండ్లు అమలయ్యేలా చూస్తానని, షూటింగ్ ప్రారంభిస్తానని నేను హామీ ఇచ్చినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరినీ కలవలేదు. ఇది ఇండస్ట్రీ సమస్య. వ్యక్తిగతంగా ఎలాంటి హామీ ఇవ్వలేను. ఫిల్మ్ ఛాంబర్‌దే తుది నిర్ణయం’ అని పేర్కొన్నారు.

Similar News

News August 9, 2025

పులివెందులలో గతంలో ఆ పరిస్థితి లేదు: ప్రత్తిపాటి

image

AP: ఎన్నికలు సజావుగా జరిగితే పులివెందులలో వైసీపీ గెలవదని టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పులివెందులలో గతంలో ఎప్పుడూ స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి లేదని చెప్పారు. రౌడీ ముఠాలను తరిమేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కడప(D) ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తెలిపారు. ఈ నెల 12న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

News August 9, 2025

PHOTOS: సెలబ్రిటీస్ రాఖీ సెలబ్రేషన్స్

image

రాఖీ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా కోలాహలం నెలకొంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సంబరాల్లో పాల్గొన్నారు. పలువురు సినీ, క్రికెట్ ప్రముఖులు రాఖీ సెలబ్రేషన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రకుల్ ప్రీత్, జెనీలియా, నిహారిక, సారా అలీ ఖాన్, కంగనా రనౌత్ తదితరులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.

News August 9, 2025

మూడు విడతల్లో వేతనాల పెంపు: నిర్మాతలు

image

సినీ కార్మికులకు మూడు విడతల్లో వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ఓకే చెప్పారు. వేతనం రూ.2వేల(రోజుకు) లోపు ఉన్నవారికి పెంచాలని ఫెడరేషన్ సభ్యులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అయితే 30శాతం పెంపునకు సుముఖంగా లేమని తెలిపారు. తొలి విడతలో 15%, రెండో విడతలో 5, మూడో విడతలోనూ 5% పెంచేందుకు ప్రతిపాదనలు చేశారు. చిన్న సినిమాలకు ఇవి వర్తించవని స్పష్టం చేశారు. ఇక కార్మిక ఫెడరేషన్ నిర్ణయం తీసుకోవాలన్నారు.