News September 3, 2025
అదే నా బిగ్గెస్ట్ డ్రీమ్: రింకూ సింగ్

భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమే తన బిగ్గెస్ట్ డ్రీమ్ అని రింకూ సింగ్ వెల్లడించారు. ‘అవకాశం వస్తే అన్ని ఫార్మాట్లలో రాణించగలననే నమ్మకం ఉంది. టీ20 స్పెషలిస్ట్ ట్యాగ్ నాకు ఇష్టం ఉండదు. ఒక్క ఫార్మాట్‌కే పరిమితం కావాలనుకోవట్లేదు. నేను సిక్సులు కొడితే ఫ్యాన్స్ ఇష్టపడతారని తెలుసు. కానీ రంజీల్లో కూడా నా సగటు (55) బాగుంది. రెడ్ బాల్ క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Similar News
News February 4, 2026
అరక అరిగిన గరిసె విరుగును

‘అరక’ అంటే పొలం దున్నడానికి ఉపయోగించే నాగలి. ‘గరిసె’ అంటే ధాన్యాన్ని నిల్వచేసే కొట్టం. ఒక రైతు తన నాగలి అరిగిపోయేంత కష్టపడి పొలం దున్నితే, ఆ శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని, ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగి, ధాన్యాగారా(గరిసె)లు నిండిపోతాయని దీని అర్థం. ఎంత కష్టపడి శ్రమిస్తే, అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి అనే నీతిని ఈ సామెత తెలియజేస్తుంది.
News February 4, 2026
ప్రేమ, కరుణకు కేంద్రం ‘అనాహత చక్రం’

ఛాతీ మధ్యలో ఉండే ఈ చక్రం ప్రేమ, కరుణకు కేంద్రం. ఇది సమతుల్యంగా ఉంటే అందరిపై నిస్వార్థమైన ప్రేమ, క్షమాగుణం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. అస్థిరత ఏర్పడితే ఒంటరితనం, గుండె సంబంధిత ఇబ్బందులు, ఇతరులపై ద్వేషం కలుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘యం’ మంత్రాన్ని జపించాలి. ఆకుపచ్చని ప్రకృతిలో సమయం గడపడం, ప్రాణాయామం చేయడం, సాటి జీవుల పట్ల దయతో మెలగడం వల్ల ఈ చక్రం అద్భుతంగా పని చేస్తుంది.
News February 4, 2026
ఏడేళ్లలో 7,400 మంది నక్సలైట్ల అరెస్ట్: కేంద్రం

గడచిన దశాబ్దన్నర కాలం నుంచి దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రేరేపిత హింసాత్మక ఘటనలు 88 శాతం మేర తగ్గాయని లోక్‌సభలో కేంద్రం వెల్లడించింది. ఏడేళ్లలో 7,400 మందికి పైగా నక్సలైట్లను అరెస్టు చేశామని, 5,880 మంది లొంగిపోయారని తెలిపింది. 2025లో 364 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చాయని, 1,022 మందిని అరెస్టు చేశాయని, 2,337 మంది లొంగిపోయారని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సభకు తెలిపారు.


